Advertisementt

లైన్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు....!

Sun 18th Sep 2016 06:43 PM
ysrcp,prakasam dist,jagan,tdp,jumping mlas  లైన్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు....!
లైన్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు....!
Advertisement
Ads by CJ

టిడిపి ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఇప్పటికే దాదాపు 20మంది ఎమ్మేల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు కూడా వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌కు ఝలక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే క్యూలో ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోవడానికి సిద్దమైపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, మార్కాపురం ఎమ్మెల్యే వెంకటరెడ్డిలు త్వరలో సైకిల్‌ ఎక్కనున్నారాని సమాచారం. ప్రకాశం జిల్లాకు వస్తే ఇప్పటికే అత్యదిక ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టిడిపిలోకి జంప్‌ చేశారు. మొత్తం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టిడిపి 5 స్దానాలు, వైసీపీ 6 స్దానాలను దక్కించుకోగా, ఒక ఇండిపెండెంట్‌ గెలిచారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, యర్రగొండ్ల పాళెం ఎమ్మేల్యే డేవిడ్‌రాజు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, చీరాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు గతంలోనే సైకిల్‌ ఎక్కిన సంగతి తెలిసిందే. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలోకి దూకితే ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ ఉన్న పట్టు మరింతగా దిగజారనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ