Advertisementt

ఈసారి హాట్‌ హాట్‌ డిసెంబర్‌!

Mon 19th Sep 2016 04:57 PM
december,dhruva,guru,nenu local,december release movies,ram charan,venkatesh  ఈసారి హాట్‌ హాట్‌ డిసెంబర్‌!
ఈసారి హాట్‌ హాట్‌ డిసెంబర్‌!
Advertisement
Ads by CJ

ఏడాది చివర్లో అంటే డిసెంబర్‌ను పొంగల్‌ బరికి రిహాల్సర్స్‌గా చెప్పవచ్చు. ప్రతి ఏడాది ఈ నెలలో విడుదలైన ఎన్నో చిత్రాలు విజయతీరాలకు చేరుకున్నాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో కూడా పలు హీరోల చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. రామ్‌చరణ్‌ 'ధృవ'తో పాటు వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న 'గురు' చిత్రాన్ని కూడా డిసెంబర్‌లో విడుదల చేయాలని, రీమేక్‌ సినిమా కాబట్టి కేవలం రెండు నెలల్లో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదలకు వెంకీ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక నాని నటిస్తున్న 'నేను..లోకల్‌' చిత్రాన్ని కూడా క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. మరి ఈ మూడు చిత్రాలతో పాటు మరో రెండు, మూడు క్రేజీ సినిమాలు కూడా డిసెంబర్‌లో విడుదలకు సిద్దమవుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాది కూల్‌కూల్‌ డిసెంబర్‌ కాస్తా హాట్‌ హాట్‌ డిసెంబర్‌గా అయ్యేందుకు రెడీ అవుతోంది. మొత్తానికి డిసెంబర్‌ నెల కూడా పలు చిత్రాలు, ఆతర్వాత పొంగల్‌ చిత్రాలతో సినిమా సందడి బాగానే మొదలవుతుందని చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ