Advertisementt

చిరు, బన్నీ ఒప్పుకుంటే ఇంక బాక్స్ బద్దలే!

Mon 19th Sep 2016 10:28 PM
chiranjeevi,allu arjun,remake,ambareesh,punith raj kumar,doddamane huduga  చిరు, బన్నీ ఒప్పుకుంటే ఇంక బాక్స్ బద్దలే!
చిరు, బన్నీ ఒప్పుకుంటే ఇంక బాక్స్ బద్దలే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరోలు పరభాషా చిత్రాలను రీమేక్ చేస్తూ హిట్స్ కొట్టేస్తున్నారు. స్టార్ హీరోల సైతం కొన్ని కొన్ని సార్లు రీమేక్ లనే నమ్ముకుంటున్నారు. రీమేక్ సినిమాలు చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయం లేకుండా రీమేక్ ట్రెండ్ ని ఫాలో  అవుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని రీమేక్ తోనే మొదలెట్టాడు. తన 150 చిత్రాన్ని తమిళ 'కత్తి'కి రీమేక్ గా 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక వెంకీ గురించి చెప్పక్కర్లేదు. 'దృశ్యం' సినిమాని రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు 'గురు' సినిమాని చేస్తున్నాడు. అయితే చిరంజీవి తన 150 వ సినిమా 'కత్తి'నే కాకుండా మరో రీమేక్ పై కన్నేశాడని వార్తలొస్తున్నాయి. చిరంజీవి తన మేనల్లుడు బన్నీ తో కలిసి ఒక కన్నడ సినిమాని రీమేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడని అంటున్నారు. కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ హీరో గా అంబరీష్ ముఖ్యమైన పాత్ర పోషించిన 'దొడ్డమనే హుడుగా' అనే చిత్రం ఈ నెల 30 న రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రం పవర్ ఫుల్ కథతో.... యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండడం తో రిలీజ్ కి ముందే దీనిని తెలుగు లో రీమేక్ చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే రాజ్ కుమార్ నటించిన పాత్రకి అల్లు అర్జున్ అయితే బావుంటుందని.... అలాగే అంబరీష్ పాత్రకి చిరంజీవి అయితే బావుంటుందని అనుకుని చిరుని, బన్నీ ని సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. వారు తమ తమ చిత్రాలతో బిజీ గా ఉండడం వలన ఇంకా చిరు అలాగే అల్లు అర్జున్ దీనికి ఒకే చెప్పలేదని అంటున్నారు. ఒకవేళ చిరు, బన్నీ గనక ఒప్పుకుంటే ఈ చిత్రం తో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాయడం ఖాయం గా చెబుతున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ