Advertisementt

అమితాబ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Tue 20th Sep 2016 02:19 PM
amitabh bachchan,pink movie,big b,big b knowledge,big about bollywood movies collections  అమితాబ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
అమితాబ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Advertisement
Ads by CJ

గత కొంతకాలంగా బాలీవుడ్ లో ఏదైనా పెద్ద చిత్రం రిలీజ్ అవుతుంది అంటే అది ఇన్ని కోట్లు వసూలు చేస్తుంది... అన్ని కోట్లు వసూలు చేస్తుంది అని తెగ డప్పు వాయించేస్తున్నారు. మరి వారు అనడం కాదుగాని కొన్ని సినిమాలు అలాగే బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేస్తున్నాయి. అలా బాక్సాఫీస్ హీరోలుగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లు ఇంకా కొంతమంది బాలీవుడ్ హీరోలకు పేరుంది. అంతెందుకు హీరోయిన్స్ ని మెయిన్ గా పెట్టి తీసిన సినిమాలు కూడా బాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసాయి అంటే అతిశయోక్తి కాదు. 

మరి ఇంతటి హీరోలు అలా కోట్ల క్లబ్బులో చేరి రికార్డులు సృష్టించేస్తుంటే అమితాబ్ మాత్రం నా సినిమాలు 100 కోట్ల క్లబ్బులో చేరవని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడు. ఇలా ఎందుకంటున్నాడంటే ఈ మధ్య అమితాబచ్చన్ కీలక పాత్ర పోషించిన 'పింక్' సినిమా గత వారం విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తుంది. ఈ సినిమాని విమర్శకుల సైతం గొప్పగా ఉందని పొగిడేస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులే కాదు మిగతావాళ్ళు కూడా  బ్రహ్మరధం పడుతున్న ఈ చిత్రం పై తనకెలాంటి అంచనాలు లేవని చెబుతున్నాడు అమితాబ్. నా సినిమా కెరీర్ లో ఇలాంటి కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ బద్దలు అనే వాటికి ఎటువంటి ప్రాధాన్యము ఉండదని... కేవలం సినిమా తీసేది, డైరెక్టర్ ఎవరు, ఈ చిత్రం లో నా పాత్ర , కథ, సబ్జెక్టు ఏమిటి అన్న విషయాలకే ప్రిఫరెన్స్ ఇస్తానని అంటున్నాడు. 

ఇక సినిమా విడుదల తర్వాత అది ఎంత డబ్బు వసూలు చేస్తుంది, కలెక్షన్స్ ఎన్ని వస్తాయో అని ఆలోచించనని అంటున్నాడు బిగ్ బి. ఇక సినిమాలో నా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటే... నా బాధ్యత మరింత ఎక్కువవుతుంది... దానిని సక్రమంగా నెరవేర్చినప్పుడే నా బాధ్యత పూర్తవుతుందని చెప్పాడు. ఇంకా బాలీవుడ్ హీరో లు తమ రెమ్యునరేషన్ ఇంత కావాలని అంత కావాలని డిమాండ్ చేసినప్పుడు.. మరి తానూ నటించే సినిమాకి ఎంత రెవిన్యూ వస్తుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అన్నదానికి వాళ్ళు గ్యారెంటీ ఇవ్వాలని పెద్ద హీరోలుగా చెప్పుకుంటున్న వారికి  సుతి మెత్తగా క్లాస్ పీకాడు. ఇక నా సినిమాకి 100 కోట్లు వసూలు చేసే కెపాసిటీ ఉందని నేననుకోను... ఇప్పటికి ఇంత వయసులో నన్ను నమ్మి నాతొ సినిమా చెయ్యడానికి ముందుకు వస్తున్న దర్శక నిర్మాతలకు మాత్రం కృతజ్ఞతలు తెలియ చేస్తాను అని అన్నాడు. అంత పెద్ద స్థాయిలో ఉండి ఇంత హుందాగా తన అభిప్రాయాన్ని తెలిపినందుకు అమితాబ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ