సురేఖ వాణి అంటే సినీ ప్రియులందరికీ పరిచయమున్న పేరే. సురేఖ వాణి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న కేరెక్టర్ ఆర్టిస్ట్. ఈమె కు కామెడీ పరం గా మంచి పేరుంది. అయితే మరో నటి హేమ అంత ఫాస్ట్ అయితే మాత్రం కాదు. హేమ అయితే తన మాటకారితనం తో... మంచి హావ భావాలు కనబరుస్తూ అందరిని ఇట్టే ఆకర్షించే శక్తి హేమలో కొంచెం ఎక్కువే. మరీ హేమ అంత కాక పోయినా సురేఖ కూడా అందరితో కలుపుగోలుగా ఇట్టే కలిసిపోతుంది.
అయితే సురేఖ వాణి వయసు మాత్రం ఎవరికీ పెద్దగా తెలీదు. సురేఖకు అమెంత కూతురుంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆమె వయస్సు అంచనా వెయ్యలేకపోవడానికి కారణం మాత్రం... సురేఖ ఎప్పుడు ఏ ఫంక్షన్ కి అటెండ్ అయినా కూడా చాలా యాంగ్ గర్ల్ లా కనబడుతూ వయసు దాచేసేది. మరలాంటప్పుడు ఆమె వయసు ఎవరికైనా ఎలా తెలుస్తుంది.
కానీ ఈ రోజు ఆమె వయసు దాదాపు ఎంతుంటుందనే విషయం ఒక ఉజ్జయింపుగా అందరికి తెలిసిపోయే వీడియో ఒకటి వెబ్ అండ్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఆ వీడియో లో సురేఖ వాణి తన కూతురితో తన ఇంట్లోనే సూపర్ గా డాన్స్ చేసే వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తుంది. తన కూతురితో సమానంగా సురేఖ కూడా పొట్టి నిక్కరుతో డాన్స్ అదరగొట్టేసింది. మరి ఈ వీడియో ని చూసిన ఎవరైనా కూడా సురేఖకు అంత పెద్ద కూతురుందా... కానీ ఆమెని చూస్తే అలా అనిపించదే అని ముక్కున వేలేసుకుంటారు. ఇంత చక్కగా సురేఖ అసలు డాన్స్ ఎప్పుడు నేర్చుకుందబ్బా అని మాత్రం జనాలు తెగ ఇదైపోతున్నారంటే నమ్మండి. ఇప్పటికే కుర్ర కారు...ఆమ్మో సురేఖ ఆంటీ చాలా హాట్ గురూ అంటూ కామెంట్స్ పడుతున్నాయంటే..ఎంతలా ఆంటీ రెచ్చిపోయి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.