Advertisementt

మరి ఇది రాజమౌళి నే లీక్ చేశాడా..?

Tue 20th Sep 2016 03:59 PM
rajamouli,babubali 2,bahubali 2 leaked pics,prabhas,rajamouli bahubali 2 pics leaked  మరి ఇది రాజమౌళి నే లీక్ చేశాడా..?
మరి ఇది రాజమౌళి నే లీక్ చేశాడా..?
Advertisement
Ads by CJ

'బాహుబలి' తో రాజమౌళి ఒక ట్రెండ్ సెట్ చేసాడు. కలెక్షన్స్ పరంగానే కాకుండా విజువల్స్ వండర్ గా 'బాహుబలి' అందరి నోళ్ళలో ఇంకా నానుతూనే వుంది. పార్ట్ 1 తోనే అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇక 'బాహుబలి 2' తో తన రికార్డును రానే బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. 'బాహుబలి 2' విడుదలకు ఎంతో సమయం కూడా లేదు. అయితే ఇప్పటికే రానాతో పాటు మరికొంతమందితో షూటింగ్ ని రాజమౌళి  ఫినిష్ చేసేశాడని.... ఇక అనుష్క తో సీన్స్ కూడా పూర్తికాబోతున్నాయని... దాదాపు 'బాహుబలి 2' షూటింగ్ పూర్తయినట్లే అని అంటున్నారు. ఇక షూటింగ్ కంప్లీట్ అయితే ఇంకేంటి విడుదల చేసేయ్యొచ్చుగా అంటారా...! 

అదెలా కుదురుతుంది. షూటింగ్ అంటే కంప్లీట్ చేసాడు గాని విజువల్ వండర్స్ ని ఏం చేస్తాడు రాజమౌళి. సినిమా షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ గ్రాఫిక్ వర్క్ ఉండనే ఉందిగా... దానికే మరికొంత సమయం పడుతుంది. అందుకే ఈ సినిమాని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేస్తానని చాలా టైం తీసుకున్నాడు రాజమౌళి. ఇక ఆ మధ్య బాహుబలి 2 స్టోరీ లీకైందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ తన షూటింగ్ స్పాట్ లో పని చేసే చిత్ర యూనిట్ కి రాజమౌళి హుకుం జారీ చేసాడట. ఎలా అంటే ఫోన్ గాని ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు షూటింగ్ పాయింట్ లో కనబడకూడదని యూనిట్ వాళ్లకి చెప్పినట్లు అందరూ చెప్పుకున్నారు.

మరి అంతటి గట్టి చర్యలు తీసుకున్నాక కూడా  'బాహుబలికి 2' కి సంబంధించి ఆన్ ద స్పాట్ లొకేషన్ లో కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఆ ఫొటోస్ చూస్తుంటే 'బాహుబలి 2' ఏ రేంజ్ లో ఉంటుంది అని అందరూ తెగ ఇదైపోతున్నారనుకోండి. ఆ ఫొటోస్ చూస్తుంటే మళ్ళీ రాజమౌళి మరో సెన్సేషన్ కి రెడీ అవుతున్నాడని అర్ధమై పోతుంది. చుట్టూ ఎత్తైన కొండలు మధ్యన బాహుబలి యూనిట్... ఆ  ఫొటోస్ చూస్తుంటే  అబ్బా ఎంత బావుందో ఆ లొకేషన్ అని అనిపించక మానదు. మరి రాజమౌళి అంత గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో ఎలా లీక్ అయ్యాయో అనే అనుమానం వస్తుంది. ఈ ఫొటోస్ ని రాజమౌళి కావాలని లీక్ చేయించాడా లేక బయటి వ్యక్తుల నుండి లీక్ అయ్యాయా అని తెలియాల్సి వుంది.

ఏదేమైనప్పటికీ బాహుబలి 2 ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతూ... బాహుబలి 2 పై ఇంకా అంచనాలను పెంచేస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ