Advertisementt

పవన్‌కు.. సుజనా రాయబారమా!

Wed 21st Sep 2016 01:45 PM
pawan kalyan,sujana chowdary,special status,special package,sujana chowdary minister  పవన్‌కు.. సుజనా రాయబారమా!
పవన్‌కు.. సుజనా రాయబారమా!
Advertisement
Ads by CJ

కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ వల్ల వచ్చిన లాభాలే అధికంగా ఉంటాయని అంటున్నాడు. తాను పవన్‌ను కలిసి ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత ఉపయోగకరమనే విషయాన్ని పవన్‌కు అర్దమయ్యేలా చేస్తానని మాట ఇస్తున్నాడు. అసలు పవన్‌ ఇప్పటికే ప్రత్యేకప్యాకేజీని విమర్శిస్తూ రెండు పాచిపోయిన లడ్డులు ఇచ్చారని ప్రకటించాడు. ఆయనకు ప్రత్యేకహోదా లేదా ఆర్దిక ప్యాకేజీ గురించి అవగాహన కల్పిస్తామని సుజనా చౌదరి చెప్పడం ఒకింత విడ్డూరంగానే ఉందని పవన్‌ అభిమానులు అంటున్నారు. ఈ రెండింటి మద్య తేడా ఏమిటి? ఏది మనకు అవసరమో పవన్‌కి సుజనా వివరించేంత సీన్‌ లేదని, పవన్‌ ఎప్పుడు ఎక్కడ ఏమి చేస్తున్నా.. ప్రతి విషయాన్ని , మరీ ముఖ్యంగా రాజకీయపరిణామాలను పవన్‌ తెలుసుకుంటూ ఉంటాదు. ఇక ఏ విషయంలోనైనా ఆయనకు సలహాలు ఇచ్చేందుకు తలపండిన విశ్లేషకులు కూడా పవన్‌కి ఉన్నారు. పవన్‌కి ఎంత తిక్కుందో ఆయనకు అంతలెక్కుందని పవన్‌ సన్నిహితులు అంటున్నారు. మరి ఈ సారి పవన్‌ టార్గెట్‌ ఏకంగా తెలుగుదేశం పార్టీపైనే ఉంటుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ