నాగ చైతన్య - శృతిహాసన్- అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లగా నటిస్తున్న ప్రేమమ్ సినిమా పాటలు హైదరాబాద్ లో విడుదలయ్యాయి. ఈ వేడుకకి కింగ్ నాగార్జున, అఖిల్, దాసరి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రేమమ్ పాటలు విడుదల చేశారు. ఈ ఫంక్షన్ కి హీరోయిన్ శృతి హాసన్ కూడా హాజరైంది. ఈ ఆడియో వేడుకలో శృతి హాసన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంత స్పెషల్ గా చెప్పడం ఎందుకంటే శృతి హాసన్ ఈ ఆడియో వేడుకలో చాలా హాట్ హాట్ గా డ్రెస్ చేసుకుని అందరి కళ్ళు ఆమె వైపు తిప్పేసుకుంది. శృతి హాసన్ అలా ఆ డ్రెస్ లో నడిచొస్తుంటే ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. శృతి హాసన్ నటనలోనే కాకుండా... సింగర్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు తెచ్చుకుంది.
సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజుల్లో ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకున్నా.. క్రమేణా తన నటనతో ప్రతి ఒక్క హీరోకి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. టాలీవుడ్ లో యూత్ స్టార్స్ అందరితో దాదాపు నటించిన శృతి ఇప్పుడు నాగ చైతన్య పక్కన 'ప్రేమమ్' లో చేస్తుంది. స్వతాహాగా శృతి.. ఫ్యాషన్ ని బాగా ఫాలో అయ్యే అమ్మాయి. ఏ ఫంక్షన్ కి వెళ్లినా అక్కడి వాళ్ల చూపు తిప్పుకోకుండా డ్రెస్ చేసుకుని చూపరులను ఇట్టే ఆకర్షించేస్తుంది. ఇక ప్రేమమ్ ఆడియో లో కూడా స్పైసి గా డ్రెస్ చేసుకుని ఆమె అందాలను తెగ ప్రదర్శించేసింది. మరి ఇలాంటి డ్రెస్ లు వేసుకుని తన అందాలను ప్రదర్శిస్తూ...తర్వాత ఫోటో గ్రాఫర్స్ నా ఫొటోస్ ఆలా తీశారు ఇలా తీశారు అని రచ్చ రచ్చ చేస్తుంది. మరి ఇలా డ్రెస్ చేసుకోవడం ఎందుకు అలా గొడవ పడడం ఎందుకు అంటున్నారు అందరూ. మరి ఈ ప్రశ్నలకి శృతి ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.