వెండితెరపై అదరగొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రంగా తమిళ 'కత్తి' రీమేక్‌గా 'ఖైదీ నెం.150' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50శాతం పైగాఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా చిరు మొట్టమొదటి సారిగా టీవీ తెరపై చేస్తోన్న అతి పెద్ద గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' డిసెంబర్ నుండి టీవీలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు నాగార్జున హోస్ట్‌గా చేసిన ఈ సక్సెస్‌ఫుల్ గేమ్ షోలో చిరు ఎలా కనిపించనున్నాడు? బుల్లితెరపై ఆయన లుక్ ఎలా ఉండనుంది? అనే విషయాలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈ గేమ్ షో కోసం చిరు కొన్ని రోజుల పాటు రిహార్సల్స్ కూడా చేశాడట. అలాగే ఈ గేమ్‌షోలో చిరు ఎలా కనిపించనున్నారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాభిమానుల కోసం ఈ గేమ్‌షోకు సంబంధించిన ఓ ప్రోమోను మాటీవీ అక్టోబర్‌లో విడుదల చేయనుంది. మొత్తానికి నాగార్జునకు ధీటుగా చిరు చేస్తోన్న ఈ గేమ్‌షో రెట్టింపు అంచనాలతో వస్తోంది. మరి చిరు ఈ విషయంలో కూడా విజేత అవుతాడో? లేదో? వేచిచూడాల్సివుంది.