Advertisementt

ఆడియోకి అభిమానులు వద్దంది అందుకే..!

Sat 24th Sep 2016 02:16 PM
ram,hyper,hyper audio launch,ram fans,heavy rains,hyderabad roads,hero ram  ఆడియోకి అభిమానులు వద్దంది అందుకే..!
ఆడియోకి అభిమానులు వద్దంది అందుకే..!
Advertisement
Ads by CJ

రామ్ 'హైపర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. అయితే రామ్ సినిమా ఆడియో విడుదలకు అన్ని సన్నాహాలు చేసుకుంటుంది. అయితే ఎక్కడ స్పెషల్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి అదేమిటంటే ఏదన్నా  హీరో ఆడియో జరుగుతుంది అంటే అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరై ఆ సినిమా ఆడియో ని విజయవంతం చేస్తారు. ఇలా అయినా తమ హీరో ని ప్రత్యేక్షం గా చూసి తరించొచ్చని.... అలా అభిమానులు సినిమాలకు సంబందించి ఏ ఫంక్షన్ కైనా ఇలాగే హాజరయ్యి తమ అభిమానాన్ని చాటుకుంటారు.  ఇక రామ్ నటించిన 'హైపర్'  సినిమా ఆడియో వేడుక జరుపు కోవడానికి సిద్ధమయ్యింది.  అయితే నా 'హైపర్' ఆడియో వేడుకకి అభిమానులెవ్వరూ రావద్దని రామ్ చెబుతున్నాడు. అదేమిటి అభిమానులని ఆడియో వేడుకకి రావద్దని చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా. అవును అలా వచ్చి వారు ఎక్కడ ఇబ్బందులు పడతారో అని రామ్ వారికి అలా సూచించాడట. ఇబ్బందులు ఎందుకు అనుకుంటున్నారా అదేనండి హైదరాబాద్ లో గత 4, 5 రోజులుగా భారీ వర్షాలు పడి నగరం అతలాకుతలం అవ్వడం తో అభిమానులు ఆడియో కి హాజరయ్యి వారు ఎక్కడ ఇబ్బందులు పడతారో అని  రామ్ అలా చెప్పాడట. ఇంకా మీరు వర్షం లో ఆడియో కి వచ్చేకంటే టీవీ లో వచ్చే లైవ్ లో 'హైపర్' ఆడియో ని చూడమని ఒక మంచి సలహా కూడా ఇచ్చాడట. మరి రామ్ అభిమానుల గురించి ఎంతలా అలోచించి ఇలాంటి సూచన చేసాడో కదా. ఇంకేమిటి రామ్ గ్రేట్ అని అందరూ తెగ పొగిడేస్తున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ