Advertisementt

కొరటాలకి మహేష్ కారిచ్చాడు..మరి ఎన్టీఆర్?

Sun 25th Sep 2016 04:05 PM
koratala siva,mahesh babu,jr ntr,janatha garage,duplex house,audi car  కొరటాలకి మహేష్ కారిచ్చాడు..మరి ఎన్టీఆర్?
కొరటాలకి మహేష్ కారిచ్చాడు..మరి ఎన్టీఆర్?
Advertisement
Ads by CJ

'జనతా గ్యారేజ్' ఇప్పుడు కలెక్షన్స్ పరంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న సినిమా. మొదటి రోజు కలెక్షన్ నుండి నిన్న మొన్నటిదాకా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో 3 వ స్థానానికి వచ్చేసింది. మరి ఈ సినిమాని కొరటాల తనదైన స్టయిల్ లో తెరకెక్కించాడు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నటనతో అదరగొట్టేసాడు. మరి కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో దుమ్ముదులిపేసింది. కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ కి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా ఈ 'జనతా గ్యారేజ్' నిలిచింది. ఇక ఈ సినిమా హిట్ తో ఎన్టీఆర్ విపరీతమైన సంతోషం లో మునిగిపోయాడని... కొరటాల తనకు ఇంత మంచి హిట్ అందించినందుకు కృతజ్ఞతలు కూడా తెలియచేసాడట. అంతే కాకుండా పర్సనల్ గా పెద్ద పార్టీ ఇచ్చాడట. ఇక తనకు తిరుగులేని హిట్ ఇచ్చిన కొరటాల ఋణం తీర్చుకోవడానికి అతనికి ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ గిఫ్ట్ ఏమిటనేది నిన్నటిదాకా ఎవరికీ తెలీదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్.. కొరటాలకి ఇచ్చే గిఫ్ట్ అందరికి తెలిసిపోయిందని అంటున్నారు. ఆ గిఫ్ట్ ఏమిటంటే ఒక డూప్లెక్స్ ఇల్లుని కొరటాలకి బహుమానంగా ఇస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికీ కొరటాల ఒక డబల్ బెడ్ రూమ్ ప్లాట్ లో వుంటున్నాడట. అందుకే ఎన్టీఆర్ బాగా ఆలోచించి ఈ డూప్లెక్స్ ఇల్లుని గిఫ్ట్ గా ఇస్తున్నాడని అంటున్నారు. మరి దీనికి కొరటాల.. ఎన్టీఆర్ కి ఏవిధంగా థాంక్స్ చెబుతాడో?

ఇలా ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమా హీరో... డైరెక్టర్స్ కి బహుమతులు ఇవ్వడం కొత్తేమి కాదు. ఇప్పటికే 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివకి ఆ సినిమా హీరో మహేష్ బాబు ఆడి కారును గిఫ్టుగా ఇచ్చాడు. ఇక ఆ మధ్యన మారుతీ కూడా ఒక గిఫ్ట్ అందుకున్నాడు. రీసెంట్ గా 'నాన్నకు ప్రేమతో' హిట్టిచ్చిన డైరెక్టర్ సుకుమార్ కి ఆ చిత్ర నిర్మాత ఒక కారుని బహుమతి ఇచ్చాడని ప్రచారం జరిగింది. మరి ఇలా డైరెక్టర్స్ కి గిఫ్ట్ గట్రా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వారు ఫ్యూచర్ లో మరిన్ని సూపర్ హిట్స్ ఇండస్ట్రీ కి అందిస్తారని అంటున్నారు. కానీ మరో పక్క ఇలా గిఫ్ట్స్ ఇస్తేనే హిట్స్ ఇస్తారా లేకపోతె ఇవ్వరా అని అంటున్నారు. కానీ ఇలా బహుమతులూ గట్రా ఇచ్చి వారిని ఎంకరేజ్ చెయ్యడం కరెక్ట్ అనేవారు ఎక్కువమంది వున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ