యాంకర్ లాస్య అందరికి పరిచయమున్న పేరే. ఈ అమ్మాయి తన యాంకరింగ్ తో అందరిని కట్టి పడేసింది. లాస్య ఇంజినీరింగ్ చదివి గూగుల్ లో జాబ్ కూడా కొట్టేసిందట. అయితే నటన మీద వున్న ఇష్టం తో లాస్య ఇలా బుల్లితెర వైపు అడుగులు వేసిందట. ఈమె యాంకర్ రవి తో కలిసి చెయ్యని ప్రోగ్రాం లేదు. ఇక రవి తో అయితే లాస్యకి ఎఫైర్ అంట గట్టేసి వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే అదంతా ఒక రూమర్ అని లాస్యా, రవి ఇద్దరూ కొట్టి పడేసారు. కేవలం మేమిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని వివరణ కూడా ఇచ్చారు. అయినా వీరిద్దరూ ఒకే ప్రోగ్రామ్స్ చెయ్యడం వల్ల వీరి మధ్యన ఏదో నడుస్తుందని మాత్రం వచ్చిన రూమర్స్ కి అడ్డుకట్ట వేయలేక పోయారు. అయితే ఇప్పుడు లాస్య మాత్రం బుల్లితెర మీద కనబడడం మానేసింది. అయితే లాస్యకు ఏదో హెల్త్ ప్రాబ్లెమ్ ఉందని అందుకే ఈ మధ్యన పెద్దగా ప్రోగ్రామ్స్ చెయ్యడం లేదని ప్రచారం జరిగింది. అయితే లాస్య ఒకరోజు సడన్ గా మీడియా ముందుకు వచ్చి నాకేం అవ్వలేదని నేను బాగానే వున్నానని చెప్పింది. కానీ ఎందుకో ఆమె ఈ మధ్యన పెద్దగా కనబడకుండా జాగ్రత్త పడుతుంది. అయితే రవిని అడిగినా అతను కూడా ఏం చెప్పకుండా తప్పించుకుంటున్నాడు. మరి లాస్య అలా ఎందుకు చేస్తుందని ఆమె పై లేని పోనీ ప్రచారం మొదలయింది.
అయితే అసలు విషయమేమిటంటే లాస్య కు పెళ్లి కుదిరిందని అందుకే ఆమె బుల్లితెర కి దూరమైందని అంటున్నారు. ఇక లాస్య పెళ్లి ఒక హీరో తో జరగబోతోందని అంటున్నారు. ఆ హీరో ఎవరో కాదని 'ఉయ్యాలా జంపాలా' తో ఇండస్ట్రీ కి పరిచయమైన రాజ్ తరుణ్ అని ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ ఎప్పటినుండో లవ్ లో వున్నారని... త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది లాస్య చెబితేనే బావుంటుంది లేకుంటే ఇది కూడా ఒక గాసిప్ గానే మిగిలి పోతుంది.