సాధారణంగా హిట్టయిన దర్శకులతోనే ఎవరైనా నటించాలని కోరుకుంటారు. కానీ ఎనర్జిటిక్ హీరో రామ్ మాత్రం తన రూట్ సపరేట్ అంటున్నాడు. వరుస పరాజయాలతో తన ట్రాక్ తప్పిన ఆయన ఈ ఏడాది 'నేను...శైలజ' చిత్రంతో మరలా రూట్‌లోకి వచ్చి హిట్టుకొట్టాడు. ఈ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల మొదటి చిత్రం 'సెకండ్ హ్యాండ్' ఫ్లాపయినా తన ప్రాజెక్ట్‌ను ఆయనకే కట్టబెట్టి విజయం సాధించాడు. కాగా ప్రస్తుతం ఆయన తనకు 'కందిరీగ' వంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్‌తో 'హైపర్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు కూడా 'రభస'తో ఫ్లాపయినా సంతోష్‌శ్రీనివాస్‌పై ఉన్ననమ్మకంతో ఈ చిత్ర చాన్స్ అయనకే ఇచ్చాడు. ఇక రామ్ తన తదుపరి చిత్రంగా లవ్ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో 'క్రేజీ ఫీలింగ్' చిత్రం చేయనున్నాడు. కాగా కరుణాకర్ సైతం రామ్‌తో చేసిన మొదటి చిత్రం 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం తీసి ఫ్లాపయిన సంగతి తెలిసిందే. మొత్తానికి రామ్ మాత్రం హిట్టులు ఫట్టులకు అతీతంగా సినిమా కథలపై, ఆయా దర్శకులకే తన చిత్రాలకు ఎంపిక చేస్తున్నాడు.