Advertisementt

సంకట స్ధితిలో శృతిహాసన్‌...!

Sun 25th Sep 2016 07:51 PM
shruti haasan,problems,dates problem,katamarayudu movie,sabash naidu movie,kamal haasan  సంకట స్ధితిలో శృతిహాసన్‌...!
సంకట స్ధితిలో శృతిహాసన్‌...!
Advertisement
Ads by CJ

శృతిహాసన్‌కు వరుస అవకాశాలు వస్తున్నా ఆమెకు డేట్స్‌ ప్రాబ్లమ్‌ వస్తోంది. పవన్‌తో చేయనున్న 'కాటమరాయుడు' చిత్రంలో ఆమె నటిస్తోంది. కాగా ఈ చిత్రం ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. కానీ ఆలస్యం అయింది. మరోవైపు శృతిహాసన్‌ తన తండ్రి కమల్‌హాసన్‌తో నటిస్తున్న 'శభాష్‌నాయుడు' చిత్రం కమల్‌కు గాయం అయిన కారణంగా కొంతకాలం నుంచి శృతిహాసన్‌ ఖాళీగానే ఉంది. ఈ రెండు చిత్రాల వల్ల తన డేట్స్‌ ప్రాబ్లమ్స్‌ కారణంగా ఈ రెండు చిత్రాలు పూర్తయ్యే వరకు మరో చిత్రానికి ఆమె డేట్స్‌ను అడ్జస్ట్‌ చేయలేని పరిస్థితిలో ఉంది. మరలా 'శభాష్‌నాయుడు' చిత్రం షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్దితుల్లో ఉన్నా.... 'కాటమరాయుడు' చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఆల్‌రెడీ ప్రారంభమైంది. ఆమె బిజీగా ఉంటున్నప్పటికీ ఈ రెండు చిత్రాల కోసం పెద్ద త్యాగమే చేసిందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి కొత్త చిత్రాలకు ఆమె ఎప్పటినుంచి డేట్స్‌ ఇస్తుందోనని... ఆమె తమ సినిమాలలో నటించాలని తాపత్రయ పడుతున్న దర్శక, నిర్మాతలు, హీరోలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ