Advertisementt

రాజ్ తరుణ్ సెటైర్ తో సమాధానం ఇచ్చాడు!

Mon 26th Sep 2016 12:18 PM
raj tarun,lasya,marriage rumors,raj tarun with lasya,raj tarun twitter  రాజ్ తరుణ్ సెటైర్ తో సమాధానం ఇచ్చాడు!
రాజ్ తరుణ్ సెటైర్ తో సమాధానం ఇచ్చాడు!
Advertisement
Ads by CJ

నిన్న సోషల్ మీడియా లో అన్ని చోట్ల ఒకటే న్యూస్. అదేమిటంటే యాంకర్ లాస్య - హీరో రాజ్ తరుణ్ ఇద్దరూ లవ్ లో వున్నారని ఒకరు రాస్తే మరొకరు పెళ్లిచేసుకోబోతున్నారని రాశారు. ఇంకొకరైతే వీరిద్దరూ ఏకంగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారని అన్నారు. మరి ఈ వార్తలకు లాస్య అయితే ఇప్పటివరకు స్పందించలేదు కానీ... రాజ్ తరుణ్ మాత్రం వారి పెళ్లి గురించి అందరికి అర్ధమయ్యే రీతిలో జవాబిచ్చాడు. ఆ జవాబుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రాజ్ తరుణ్. అదేమిటంటే 'సభకు నమస్కారం.. నా సంబంధం లేకుండా.. నా ప్రమేయం లేకుండా.. కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్ లో ఒకే ఒక్కసారి కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ కాస్త వెటకారంతో కూడిన పదాలతో తనదయిన స్టైల్ లో  జవాబిచ్చాడు. అంతే కాదు నేను ఇలా మాట్లాడడం మీకు బాధనిపించొచ్చు... కానీ ఇలా కాకుండా ఎలా మాట్లాడాలో నాకర్ధం కావడం లేదు. ఎందుకంటే మీరు వ్రాసిన రాతలు నన్ను బాధించాయని చెప్పుకొచ్చాడు. ఇంకా అసలు నాకు త్రీ సంవత్సరాల వరకు పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమేలేదు అని... నా పెళ్లి మీడియా మిత్రులందరికీ చెప్పే చేసుకుంటానని సెలవిచ్చాడు. అసలు ఈ రూమర్ ని ఎవరు క్రియేట్ చేశారోగాని... మీరందరూ ఇది నమ్మే పరిస్థితి వచ్చేసింది. మరి దీన్ని గురించి చదివి మీ టైం వెస్ట్ చేసుకున్నందుకు సారీ అంటూనే మరోసారి థాంక్స్ చెప్పాడు. ఇక పెళ్లి గురించి ఇప్పుడప్పుడే ఏ గాసిప్ ని క్రియేట్ చెయ్యకుండా మీడియా కి కూడా క్లియర్ చేసేసాడు. రాజ్ తరుణ్ ఇంతలా స్పందించక పొతే మాత్రం అందరూ ఇది నిజమనిపించేలా వున్నాయి నిన్న వచ్చిన వార్తలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ