Advertisementt

చైతూ ఒప్పుకున్నాడు..ఇంక సమంతే..!

Mon 26th Sep 2016 03:06 PM
samantha,2 states,naga chaitanya,abhishek pictures,2 states remake  చైతూ ఒప్పుకున్నాడు..ఇంక సమంతే..!
చైతూ ఒప్పుకున్నాడు..ఇంక సమంతే..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన '2 స్టేట్స్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి అభిషేక్ పిక్చర్స్ సిద్ధమైంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కరణ్ జోహార్ తీశారు. ఇంకా ఈ చిత్రం లో అర్జున్ కపూర్ - ఆలియా భట్ లు నటించారు. అయితే మొట్టమొదటిసారి బాలీవుడ్లో కరణ్ జోహార్ తన చిత్ర  రీమేక్ రైట్స్ ని అమ్మడం తొలిసారి. అయితే ఆ రైట్స్ ని తెలుగులో అభిషేక్ పిక్చర్స్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ చిత్రాన్ని రిమేక్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ హీరో హీరోయిన్స్ ని వెతికే వేటలో కూడా పడిందట.

అయితే ఈ '2 స్టేట్స్' చిత్రం లో ఇప్పటికే ప్రేమలో ఉండి కొంచెం టైం తీసుకుని పెళ్లిపీటలెక్కుతున్న జంట నాగ చైతన్య - సమంత నటిస్తే  బావుంటుందని ఆలోచిస్తున్నారట. అయితే నాగ చైతన్యని సంప్రదించగా చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని... ఇంకా సమంతని అప్రోచ్ అవ్వాలని.. ఆమె కూడా ఒకే చేస్తుందనే నమ్మకం తో అభిషేక్ పిక్చర్స్ వారు ఉన్నట్టు సమాచారం.

తెలుగు అబ్బాయిగా నాగ చైతన్య... మలయాళీ అమ్మాయిగా సమంత ని ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. మరి ఏం సినిమాలు ఒప్పుకోకుండా.... అర్ధవంతమైన పాత్రలు కోసం ఎదురు చూస్తున్న సమంత ఈ సినిమాలో చెయ్యడానికి ఒప్పుకుంటుందా అనేది మాత్రం తెలియాల్సి వుంది. అయితే ఆమెని ఎలాగైనా ఒప్పిస్తామనే కాన్ఫిడెంట్ తో అభిషేక్ పిక్చర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాతో వి వి వినాయక్ అసిస్టెంట్ వెంకట్ కుంచె దర్శకుడిగా పరిచయమవుతున్నాడని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ