Advertisementt

ప్రభాస్‌ బర్త్‌డే కి లైన్ లో పెట్టారు..!

Tue 27th Sep 2016 06:59 PM
bahubali 2,bahubali the conclusion,prabhas,prabhas birthday special,ss rajamouli  ప్రభాస్‌ బర్త్‌డే కి లైన్ లో పెట్టారు..!
ప్రభాస్‌ బర్త్‌డే కి లైన్ లో పెట్టారు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అన్ని వర్గాల వారు 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' చిత్రం ట్రైలర్‌ ఎప్పుడు వస్తుందా? అని దేశ, విదేశీ సినీ ప్రేమికులు సైతం ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి- ది బిగినింగ్‌'ను తలదన్నేలా రూపొందుతున్న 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు నవంబర్‌తో ముగుస్తాయని, దాని తర్వాత ఈ చిత్రానికి కీలకమైన గ్రాఫిక్స్‌ వర్క్స్‌, పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలవుతాయని తెలుస్తుంది. కాగా ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి చూపంతా 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'పై పెట్టి ఉన్నాడు. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 28, 2017లో విడుదల అవుతుందని కరణ్‌జోహార్‌ ఇప్పటికే అఫీషియల్‌గానే అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో బాహుబలిగా ప్రభాస్‌తో పాటు ఇతర పాత్రలన్నింటికీ ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్‌ అదిరిపోయే లెవల్‌లో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ