కర్ణాటకలో బీజేపీ నాయకుడిగా, మంత్రిగా చక్రం తిప్పిన గాలి జనార్దన్‌రెడ్డి, మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలతో జైలు కెళ్లాడు. చివరకు బెయిలు కోసం జడ్జికి లంచం ఇచ్చిన కేసుని కూడా గాలి ఎదుర్కున్నాడు. మరి ఆయన కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం రేపింది. కొన్నాళ్ల నుండి ఆయన పేరు వార్తల్లో లేకుండా పోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు జనార్దన్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. మళ్ళీ ఏదన్నా తప్పు చేసి ఇలా వార్తల్లోకెక్కాడని అనుకుంటున్నారేమో..! అదేం లేదు?
ఇంతకీ అసలు విషయమేమిటంటే జనార్దన్ రెడ్డి తన కూతురి మ్యారేజ్ గురించి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకొచ్చాడు. ఆయన తన కూతురి పెళ్లిని చాలా ఘనంగా 10 కాలాలపాటు గుర్తుండిపోయే విధం గా చెయ్యాలనుకుంటున్నాడని అంటున్నారు. ఈ మధ్యనే తన కూతురి ఎంగేజ్మెంట్ ని హైదరాబాద్ లోని బడా పారిశ్రామిక వేత్త కొడుకుతో జరిపించాడని.... ఇక పెళ్లి వచ్చే నవంబర్ లో చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇక ఈ పెళ్లి గురించి ప్రపంచం అంత చెప్పుకునేలా చెయ్యాలని భారీ ప్లాన్ వేస్తున్నాడట. బళ్లారిలోనే కాక ఇటు సౌత్ లోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలవాలని తహ తహలాడుతున్నాడట.
ఇక ఈ పెళ్లిని అంత గ్రాండుగా చెయ్యాలంటే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి. అందుకే గాలి బాగా ఆలోచించి బాలీవుడ్ స్టార్స్ తో మంచి అట పాట పెట్టించాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ షారుక్, కత్రినాకైఫ్ లని సంప్రదించగా వారు ఒప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ప్రభుదేవా, తమన్నాలని అడగగా వారు ఇంకా సమాధానం చెప్పలేదని అంటున్నారు. ఇక వారికి ఇచ్చే రెమ్యునరేషన్ విషయం లో వారికీ కావాల్సింది వారినే కోరుకోమన్నట్లు గాలి చెప్పాడని అంటున్నారు. మరి కావాల్సినంత డబ్బు ముట్టజెబుతుంటే ఎవరు మాత్రం కాదంటారు. అడిగిన వాళ్ళు అడిగినట్లు ఒప్పుకుంటారని అంటున్నారు. ఇక ఈ పెళ్ళికి ఇండియా లో వున్న బడా రాజకీయవేత్తలు హాజరవుతారని సమాచారం.