Advertisementt

సంచలనాలకు ధోని రెడీ... !

Wed 28th Sep 2016 02:54 PM
ms dhoni,dhoni biopic,neeraj pande,ms dhoni cricketer promotes ms dhoni movie,sushanth singh rajputh  సంచలనాలకు ధోని రెడీ... !
సంచలనాలకు ధోని రెడీ... !
Advertisement
Ads by CJ

మొదట్లో ధోని జీవిత చరిత్రను తెలిపే బయోపిక్‌ అంటూ నీరజ్‌పాండే దర్శకత్వంలో 'ఎం.ఎస్‌.ధోని' చిత్రాన్ని అందరూ లైట్‌గా తీసుకున్నారు. అందులోనూ ఇందులో ధోనిగా నటించేది పెద్దగా పేరులేని సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ కావడం కూడా మొదట్లో ధోని బయోపిక్‌ విషయాన్ని లైట్‌గా తీసుకునేందుకు కారణం గా చెప్పుకోవచ్చు. కానీ ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడే కొద్ది ఈ చిత్రానికి హైప్‌ వచ్చింది. ఇందులో ధోని జీవిత చరిత్ర కావడంతో ఆయనకు పారితోషికంగా 70కోట్లుఇచ్చారు. అయితే ప్రమోషన్‌లో కూడా ఆయన పాల్గొనాలనేది కండిషన్‌. అదే ఇప్పుడు ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అద్బుతంగా జరుగడానికి దోహదపడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలోని పలు భాషలతో కలిపి 150కోట్లకు పైగా బిజినెస్‌ చేసింది. ఇక తాజాగా ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ఏకంగా 60కోట్లకు అమ్ముడయ్యాయి. ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను వాడుకోవాలని భావించిన నీరజ్‌పాండే ఈ చిత్రాన్ని 60 దేశాల్లో ఏకంగా 5000కు పైగా థియేటర్లలో సందడి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో మాత్రం ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. ఇందులో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన ట్రైలర్స్‌ చూస్తే ధోని పాత్రలో ఆయన ఒదిగిపోయాడని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం విడుదైన తర్వాత ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ