Advertisementt

అబ్బో..రాజ్ తరుణ్ పై మరో రూమర్..!

Thu 29th Sep 2016 02:20 PM
raj tarun,anchors,lasya,raj tarun weds lasya,rumors on raj tarun  అబ్బో..రాజ్ తరుణ్ పై మరో రూమర్..!
అబ్బో..రాజ్ తరుణ్ పై మరో రూమర్..!
Advertisement
Ads by CJ

రాజ్ తరుణ షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసుకుంటూ కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోగా 'ఉయ్యాలా జంపాల'తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఇక పరిచయమైన మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆతర్వాత వచ్చిన సినిమాల్లో కొన్ని హిట్స్ కొన్ని ఫట్స్ ఉన్నప్పటికీ  మినిమం గ్యారెంటీ హీరోగా అతి తక్కువ కాలంలో ఎదిగాడు. అయితే రాజ్ తరుణ్ మీద ఈ మధ్య తెగ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వచ్చిన ఒక రూమర్ చూసి  రాజ్ తరుణ్ కి దిమ్మ తిరిగిందంటే నమ్మండి. అదేమిటంటే యాంకర్ లాస్యకి, రాజ్ తరుణ్ కి ఎఫైర్ అంటగట్టడమే కాకుండా సోషల్ మీడియాలో వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేసేశారు. 

అయితే వెంటనే రాజ్ తరుణ్ స్పందించి మాకు అసలు పరిచయమే లేదు ఒకే ఒక్క ఆడియో లో కలిసినందుకు మాకు పెళ్లి చేసేసారు. అసలు మా ఇద్దరి మధ్య ఏం లేదని మరో 3  ఏళ్ళ వరకు నేను పెళ్లి చేసుకోనని ఆ ప్రేమ, పెళ్లి రూమర్ కి చెక్ పెట్టేసాడు. అయితే ఇతని మీద ఇప్పుడు తెగ గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. అవేమిటంటే రాజ్ తరుణ్ తన సినిమా సెట్స్ లో హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని ఎలా ఉండాలో చెబుతుంటాడని అంటున్నారు. ఇంకా యాంకర్స్, సినిమాల్లో నటీమణులుగా ఎంట్రీ ఇవ్వాలనే చాలా మంది అమ్మాయిలు పర్సనల్ గా రాజ్ తరుణ్ ని కలుస్తూ ఉంటారని చెబుతున్నారు. మరి రాజ్ తరుణ్ ఏమన్నా డైరెక్టరా అతన్ని కలవడానికి అమ్మాయిలు వెళ్ళడానికి అని చాలామంది రాజ్ తరుణ్ పై కామెంట్స్ విసురుతున్నారు. 

మరి ప్రేమ పెళ్లి విషయం లో వచ్చిన రూమర్స్ కి సకాలం లో స్పందించి చెక్ పెట్టిన రాజ్ తరుణ్ ఇప్పుడు వస్తున్న వార్తలకు ఎలా స్పందిస్తాడో చూడాలి. అసలు స్పందిస్తాడా లేక సైలెంట్ గా ఉండిపోతాడా! అనేది  చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ