Advertisementt

ఓయ్.. అవికాగోర్ అక్కడేం చేస్తున్నావ్?

Thu 29th Sep 2016 07:54 PM
avika gor,uyyala jampala,avika gor affair with bollywood actor,avika affair news  ఓయ్.. అవికాగోర్ అక్కడేం చేస్తున్నావ్?
ఓయ్.. అవికాగోర్ అక్కడేం చేస్తున్నావ్?
Advertisement
Ads by CJ

ఉయ్యాలా జంపాల సినిమాలో హీరోయిన్ గా చేసిన అవికా గోర్ గురించి తెలియని తెలుగు వారుండరు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ తెలుగులో ‘ఉయ్యాలా జంపాల’ తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత రెండు, మూడు సినిమాలు చేసి క్రేజ్ ను పెంచుకున్న ఈ భామ ఇక్కడ అంతగా బాగాలేదని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈమె హిందీలో ఓ సీరియల్ కూడా చేస్తుంది.  తెలుగులో అస్సలు తీస్తామన్నా గానీ సినిమాలు ఒప్పుకోవడం లేదు. అందుకు కారణం ఉందని బాలీవుడ్ లో సంచరిస్తున్న ఓ వార్త ద్వారా తెలుస్తుంది.

అవికా గోర్ తనకన్నా చాలా పెద్దవాడైన ఓ బడాహీరోతో ఘాటు ప్రేమలో మునిగిపోయినట్టు తెలుస్తుంది. నిజానికి వీరిద్దరూ ఫ్రెండ్స్ లా పరిచయం ఏర్పరచుకొని, ఆ తర్వాత ప్రేమగా మార్చుకున్నారని అంతటా టాక్ నడుస్తుంది. అంతే కాకుండా ఆ ఇద్దరు ఇప్పుడు ముంబైలో చక్కర్లు కొడుతూ జోరుగా షికార్లు, పార్టీలు, పబ్ లు అంటూ నానా హంగామా చేస్తున్నట్లు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తుంది. ఈ ఇద్దరి వ్యవహార శైలిపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన  ఈ భామ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొంటుంది కానీ అస్సలు విషయం మాత్రం వేరే ఉందిలే అంటున్నారు సినీ జనాలు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ