Advertisementt

చిన్న హీరోలదే దసరా హడావుడి..!

Fri 30th Sep 2016 02:28 PM
dussehra,tollywood dussehra hungama,small heroes,premam,jaguar,eedu gold ehe,mana oori ramayanam  చిన్న హీరోలదే దసరా హడావుడి..!
చిన్న హీరోలదే దసరా హడావుడి..!
Advertisement
Ads by CJ

సినిమా వాళ్లకు విజయదశమి పండుగ ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలో తమ చిత్రాలను విడుదల చేయాలని, విద్యార్ధులకు కూడా సెలవుల సీజన్‌ కావడంతో అందరూ ఈ సీజన్‌లో ముందుంటారు. తమ తమ చిత్రాలను దసరా బరిలోకి దించాలని భావిస్తుంటారు. అయితే ఈసారి దసరా విశేషం ఏమిటంటే పోటీలో ఒక్కస్టార్‌ చిత్రం కూడా విడుదలకు లేదు. చిన్నోళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనే ఆసక్తితో ఉన్నారు. అక్టోబర్‌లో 7వ తేదీ నుంచి 10వ తేదీలోపు 'ప్రేమమ్‌, ఈడు గోల్డ్‌ ఎహే, అభినేత్రి, మన ఊరి రామాయణం' వంటి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్‌ కుమార్‌ గౌడ్‌ హీరోగా తెరంగేట్రం చేస్తోన్న 'జాగ్వార్‌' కూడా 75 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, కన్నడ భాషల్లో భారీగా అక్టోబర్‌ 6వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. మొత్తానికి ఈ దసరాకి చిన్న హీరోలు, వారి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ