తెలుగులో సమంత - నాగచైతన్యల వలే తమిళ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచే జంట హీరో విశాల్, వరలక్ష్మి. వరలక్ష్మి.. శరత్ కుమార్ కూతురు. వరలక్ష్మి తో విశాల్ గత 7 సంవత్సరాలుగా ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ మధ్య వీరిద్దరూ లవ్ బ్రేకప్ అయ్యారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అసలు వీరిద్దరి మధ్య శరత్ కుమార్ ఎదో మనస్పర్ధలు సృష్టించాడని అంటున్నారు. ఎందుకంటే శరత్ కుమార్ కి విశాల్ అంటే వ్యక్తిగతంగా పడదని... అందుకే శరత్ కుమార్.. విశాల్ - వరలక్ష్మి ల ప్రేమని ఒప్పుకోవడం లేదని కూడా ప్రచారం జరుగుతుంది.
శరత్ కుమార్ ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా కూడా వరలక్ష్మి.. విశాల్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. కానీ ఇప్పుడు తాజాగా మరో వార్త తో ఈ జంట వార్తల్లోకెక్కింది. అదేమిటంటే విశాల్ - వరలక్ష్మి కి ఏవో విభేదాలు తలెత్తడంతో తమ ఏడేళ్ల ప్రేమకి బ్రేకప్ చెప్పారని అంటున్నారు. ఇక ఆ తర్వాత వరలక్ష్మి ట్విట్టర్ లో ప్రేమంటే ఇదేనా.... అసలు ఈ లోకంలో ప్రేమ అనే పదం ఏమై పోయిందో... అని ట్వీట్ చేసింది. ఇన్ని సంవత్సరాల బంధాన్ని ఒక వ్యక్తి తేలికగా తెంపెయ్యడానికి చూస్తున్నాడని ఘాటుగా స్పందించిందిi. ఇక తర్వాత తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయని... అయినా నేను నా కెరీర్ మీద దృష్టి సారించాలనుకుంటున్నాని చెప్పుకొస్తుంది. ఇక మీరు కొంచెం కామ్ గా ఉంటే నా పని నేను చేసుకుంటానని మీడియా కి చురకలంటించింది.
ఇక వరలక్ష్మి స్పందన ఇలా ఉంటే విశాల్ మాత్రం కామ్ గా తన పనులు తానూ చేసేసుకుంటున్నాడు. ఈ విషయమై స్పందించడం ఇష్టం లేదా? లేక వరలక్ష్మి ఎలాగూ లవ్ బ్రేకప్ గురించి ఓపెన్ ఐపోయిందిగా ఇంకా నేనేందుకు దీని గురించి వివరణ ఇవ్వడం అనుకున్నాడా!..అనేది ఆ విశాల్ కే తెలియాలి.