Advertisementt

అంత ఇష్టమైతే సల్మాన్ పాకిస్తానే పోవచ్చుగా!

Sat 01st Oct 2016 08:41 PM
salman khan,pakistan,uri incident,sivasena,mns leaders  అంత ఇష్టమైతే సల్మాన్ పాకిస్తానే పోవచ్చుగా!
అంత ఇష్టమైతే సల్మాన్ పాకిస్తానే పోవచ్చుగా!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ కండలవీరుడు, ప్రముఖ సినీ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల పాకిస్తాన్ నటీనటులకు వత్తాసు పలికిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ నటీనటులను వెనకేసుకొస్తూ, కళలను, యుద్ధాన్ని వేరు వేరుగా చూడాలంటూ సన్నాయి నొక్కులు పలుకుతున్న సల్మాన్ ఖాన్ పై శివసేన, ఎంఎన్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ పై తాజాగా శివసేన నాయకురాలు మనీషా కాయండే కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ నటులపై సల్మాన్ ఖాన్‌కు అంత ప్రేమ ఉంటే ఆయన కూడా పాకిస్తాన్ వలస వెళ్ళిపోవాలని ఆమె నిర్మొహమాటంగా వెల్లడించింది. దీనిపై ఆయనకు క్లాస్ పీకాల్సిందేనంటూ ఆమె దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది.  

భారత్ అంగీకారంతోనే పాక్ నటులు వీసాతో భారత్ లో ఉన్నారని, అలాంటి వారిపై యుద్ధ ప్రాతిపదికన తిరిగి పాకిస్తాన్ వెళ్ళమనడం సబబు కాదని సల్మాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన తీవ్ర ప్రతిఘటనను చవిచూడాల్సి వస్తుంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ