ఈ మధ్య మన నటులు మరీ ముఖ్యంగా అలీ, బాలకృష్ణ వంటి వారు వేదికలపై మహిళలను కించపరిచిన వారి లిస్ట్‌లో ఉన్నారు. కాగా రాధికాఆప్టే వంటి నటి ఓ హీరో తనను బెడ్‌ర్రూంకి రమ్మని బెదిరించాడని సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఇలా మహిళలను కించపరిచిన వారి కోవలోకి నాని కూడా చేరాడు. ఆయన 'హైపర్' వేడుకలో హీరోయిన్ రాశిఖన్నా అందంపై వాడిన పదాలు, ఇంకా ఏదో చెప్పాలనుంది అంటూ రాశిఖన్నా వేసుకున్న డ్రెస్‌పై కామెంట్స్ చేశాడు. ఈ వివాదం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాస్త ఆలస్యంగా ఈ విషయాలపై దక్కన్ క్రానికల్ నానిని టార్గెట్ చేస్తూ తీవ్రమైన పదజాలమే వాడింది. ఎప్పుడు నీట్‌గా మాట్లాడే నాని రాశిఖన్నాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నాని ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది.