Advertisementt

డికె అరుణ రాజీనామాస్త్రం...!

Sun 02nd Oct 2016 02:48 PM
dk arjun,gadwal district,trs,kcr  డికె అరుణ రాజీనామాస్త్రం...!
డికె అరుణ రాజీనామాస్త్రం...!
Advertisement
Ads by CJ

గద్వాల్‌ను జిల్లాగా చేయాలని మొదటి నుండి డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ శాసన సభ్యురాలు డి.కె. అరుణ రాజీనామాకు సిద్దమయ్యారు. జిల్లా ఏర్పాటుకు తానే అడ్డంకి అని టిఆర్‌ఎస్‌ నాయకులు అంటుండటంతో  మరి తాను రాజీనామా చేస్తే గద్వాల్‌ను జిల్లా చేయాలని డికె. అరుణ టిఆర్‌ఎస్‌ గ్రౌండ్‌లోకి బాలును విసిరింది. తాను రాజీనామా చేస్తున్నానని సీఎం కె. చంద్రశేఖర్‌రావుకు లేఖ రాయడంతో పాటు స్పీకర్‌ మధుసూదనాచారికి ఆమె తన రాజీనామాను అందజేయనుందని సమాచారం. మొత్తానికి కొత్త జిల్లాల కారణంగా తెలంగాణలోని పలు చోట్ల ఆందోళనలు తలెత్తుతున్నాయి. గద్వాల్‌తో పాటు సిరిసిల్ల, జనగామలు కూడా కొత్తజిల్లాలను ఏర్పాటు చేసి తమకు ప్రత్యేక జిల్లాలను ప్రకటించాలని ఉద్యమాలతో రగిలిపోతున్నాయి. మొత్తానికి కొత్త జిల్లాల వ్యవహారంలో కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మరి వారి అసంతృప్తిని కేసీఆర్‌ అందరికీ ఆమోదయోగ్యంగా ఒప్పించగలడా? అనే అంశంపై తెలంగాణలో తీవ్ర కసరత్తులు జరుగుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ