తప్పు నిజంగా మన ఇండస్ట్రీలోనే ఉందా? ఇక్కడ హీరోలకు తప్పితే హీరోయిన్లకు అసలు విలువ ఇవ్వరా? అలాగే ఇక్కడ హీరోయిన్లను లైంగికవేదింపులకు గురిచేస్తారా? హీరోలకు కోట్లకు కోట్లు ఇచ్చే నిర్మాతలు షూటింగ్ పూర్తి కాగానే హీరోయిన్లకు రెమ్యూనరేషన్‌లను సైతం ఎగ్గొడతారా? దక్షిణాదిన తమిళంలో రాని వేదింపులు, ఆరోపణలు తెలుగుపై మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఇందులో హీరోయిన్ల పట్ల వేదింపులు నిజమేనా? నిన్నటికి నిన్న రాధికాఆప్టే తెలుగు పరిశ్రమపై విషం చిమ్మింది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కి వెళ్లి 'పింక్' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందుతున్న తాప్సి కూడా టాలీవుడ్‌పై విరుచుకుపడుతోంది. మరి వీరికి టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడానికి సెక్స్ వేదింపులు కూడా నిజమేనని వీరు మీడియా ఎదుటే వాపోతున్నారు. మరి ఈ వ్యాఖ్యలు నిజమైనవో కాదో తెలియక బయట మాత్రం టాలీవుడ్ అంటే అందరు భయపడే పరిస్దితి ఏర్పడుతోంది.