గత 10 రోజుల నుండి జయలలిత తీవ్ర అనారోగ్య సమస్యతో చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం పట్ల కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందులోను గత 4 రోజులుగా డాక్టర్స్ కూడా జయకు ఏమైందో హెల్త్ బులిటెన్ కూడా విడుదల చెయ్యకుండా ఈ ఆందోళనకు కారణమయ్యారు. ఇక ఆదివారం తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలిత వున్న హాస్పిటల్ కి వెళ్లి జయని పరామర్శించి..... జయలలిత కోలుకుంటున్నారని ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ కి అభినందనలు తెలిపామని తమిళనాడు రాజ్ భవన్ నుండి ఒక లేఖని విడుదల చేశారు. కానీ అసలు జయ కి ఏం సమస్య వచ్చింది....ఆమె దేని కారణంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుందో అని మాత్రం తెలపలేదు. ఇంత జరుగుతున్నా కూడా కార్యకర్తలు, అభిమానుల ఆందోళన మాత్రం తగ్గడం లేదు. అసలు జయ గురించి పూర్తిగా తెలిసేవరకు ఈ ఆందోళన ఇలాగే ఉంటుందని అంతా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జయలలిత గత 10 రోజులుగా హాస్పిటల్ లో ఉండడం వలన తమిళనాడు లో పాలన కుంటుపడుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అసలు జయ పరిస్థితిని పూర్తిగా తెలపాలని కరుణానిధి కూడా డాక్టర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాడు. మరి జయ హాస్పిటల్ లో వున్న కారణం గా తమిళనాడుకి ఎవరో ఒకరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ఎవరనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. అయితే జయలలితతో చాలాకాలం స్నేహం చేసి ఈ మధ్యన మనస్పర్థల కారణం గా విడిపోయిన శశికళ ఇప్పుడు తమిళనాడుకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా చెయ్యాలని అనుకుంటున్నట్టు సమాచారం. అసలు గతంలో శశికళ.. జయకి బాగా దగ్గరై జయని వెనకుండి నడిపించింది. శశికళ తెర చాటున తమిళనాడు రాజకీయాలను శాసించిందనేది జగమెరిగిన సత్యం. అయితే కాల క్రమేణా జయని తొక్కేసి శశికళ హైలెట్ అవ్వాలనుకుంది. ఇది గమనించిన జయ శశికళని పూర్తిగా పక్కన పెట్టేసి... ఇప్పుడు ఏక చత్రాధిపత్యం గా తమిళనాడుని ఏలుతుంది. ఇక గత కొంతకాలం నుండి శశికళ పూర్తిగా సైలెంట్ అయిపోయి పక్కకి జరిగిపోయింది.
మళ్ళీ ఇన్నాళ్లకు జయకు అనారోగ్యం కారణంగా ఆమె పేరు వార్తల్లోకొచ్చింది. ఇక జయ నెమ్మదిగా కోలుకుంటుందని..... అయినా కూడా చాలా కాలం హాస్పిటల్ లోనే జయ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్న కారణంగా ఎవరో ఒకరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలి కాబట్టి... ఆ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు శశికళ అప్పుడే మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఉన్నపళంగా ఏఐడీఎంకె ఎమ్మెల్యేలంతా చెన్నైకి రావాలంటూ శశికళ ఓ ప్రకటన విడుదల జారీ చేశారు. సోమవారం వీరంతా నగరానికి రావాలని ఆమె ఆ ప్రకటనలో వారిని కోరారు. ఇక పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ మీటింగ్ కి హాజరవ్వొచ్చని అంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇంతకు ముందు జయ జైలుకెళ్ళినప్పుడు కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం మాత్రం నోరు విప్పకుండా మౌనం వహిస్తున్నారు.
ఇక తమిళనాడు రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం కానున్నాయని ఈ పరిణామాలు చూస్తుంటే అందరికి అర్ధమవుతుంది.