Advertisementt

మహేష్ వైఫ్ పొలిటికల్ ఎంట్రీ...?

Wed 05th Oct 2016 12:45 PM
mahesh babu,politics,namratha sirodkar,galla jayadev,burripalem,mahesh wife political entry  మహేష్ వైఫ్ పొలిటికల్ ఎంట్రీ...?
మహేష్ వైఫ్ పొలిటికల్ ఎంట్రీ...?
Advertisement
Ads by CJ

ఈ మధ్యన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య బాగా హైలెట్ అవుతుంది. ఎలా అంటే ఆమె తన భర్త దత్తత తీసుకున్న గ్రామం బుర్రిపాలెం లో పర్యటిస్తూ అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ మీడియాలో కనబడుతుంది. అయితే ఆమె ఒకప్పుడు మిస్ ఇండియా అయినప్పటికీ కొన్నాళ్ళు సినిమాల్లో హీరోయిన్ గా చేసి మహేష్ బాబుని పెళ్లాడిన తర్వాత ఆమె  సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక పెళ్ళి, పిల్లలు  అంటూ ఆమె పూర్తిగా గృహిణి బాధ్యతలు చేపట్టింది. అయినా భర్త మహేష్ చేసే పనులకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందనేది అటు రాజకీయ వర్గాలలో,  ఇటు  సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎలాగూ భర్త దత్తత గ్రామంలో సామాన్య ప్రజలతో మమేకమవుతూ,  అక్కడి సమస్యలపై స్పందిస్తూ, ఎక్కువ శ్రద్ధను కనబరుస్తూ బాగా హైలెట్ అవుతుంది. ఇంకా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక అక్కడ జరిగే విషయాలని ఎప్పటికప్పుడు మహేష్ కి చేరవేస్తూ యాక్టీవ్ గా ఉంటోంది. మహేష్ ఎప్పుడూ షూటింగ్ లతో బిజీ గా ఉంటాడు అందుకే నమ్రత ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకుని మహేష్ కి హెల్ప్ చేస్తుంది.

అయితే ఇదంతా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికే ఇలా పావులు కదుపుతోందని అంటున్నారు. ఇక ఎలాగూ మహేష్.. నేను రాజకీయాలకు దూరం గా ఉంటానని... పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అంటున్నాడు. మరి నమ్రత కు ఇంట్రెస్ట్ ఉంది గనక.... ఇలా రాజకీయాల్లో తానూ ప్రజలకు సేవ చెయ్యాలని అనుకుంటుందేమో. అందుకే ఆమె పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందనేది ఒక వాదన. ఇక ఎలాగూ మహేష్ బావ గల్లా జయదేవ్ రాజకీయాల్లో మంచి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి.. నమ్రత రాజకీయ ఎంట్రీ ఇస్తే..మహేష్ కూడా ప్రచారానికి వస్తాడనే ప్లాన్ తో..నమ్రత రాజకీయ ఎంట్రీ కోసం పట్టుపడుతున్నాడేమో మరి.