Advertisementt

'బాహుబలి 2' రేంజ్‌ వెయ్యికోట్లా...?

Wed 05th Oct 2016 09:01 PM
bahubali 2,1000 crores,bahubali pre release business,prabhas,ss rajamouli  'బాహుబలి 2' రేంజ్‌ వెయ్యికోట్లా...?
'బాహుబలి 2' రేంజ్‌ వెయ్యికోట్లా...?
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రం తర్వాత టాలీవుడ్‌ రేంజే మారిపోయింది. ఈ చిత్రం మొదటి పార్ట్‌ దాదాపు 650కోట్లు సాధించిందని ట్రేడ్‌వర్గాల సమాచారం. ఇక ప్రస్తుతం రూపొందుతున్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం బిజినెస్‌ను చూస్తే దాదాపు వెయ్యికోట్లు సాధించేలా కనిపిస్తోందని ఈ చిత్ర యూనిట్‌ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్‌సీస్‌ రైట్స్‌ (తెలుగు, తమిళ, మలయళం) వెర్షన్స్‌ 45 కోట్లకు అమ్ముడుపోయాయి. ఓవర్‌సీస్‌లో భారీ డిస్ట్రిబ్యూషన్‌గా పేరున్న గ్రేట్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌ వారు ఈ రేటుకు ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే ఇదే సంస్ద ఈ చిత్రం హిందీ రైట్స్‌ను కమిషన్‌ బేసిస్‌ మీద తీసుకున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను మొదటి భాగాన్ని జ్ఞానవేల్‌రాజా కొనుగోలు చేయగా రెండో భాగాన్ని కె. డిస్ట్రిబ్యూషన్‌ సంస్ద అధినేత రంగరాజన్‌ 52 కోట్లకు సొంతం తీసుకున్నాడు. ఇక హిందీలో ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ను జీఈసీ చానెల్‌ 55కోట్లకు సొంతం చేసుకుంది. ఇక తెలుగు, బాలీవుడ్‌లలో ఈ చిత్రం ధియేటికల్‌ రైట్స్‌ 400కోట్లకు చేరేలా కనిపిస్తోంది. ఇక తెలుగు శాటిలైట్‌ హక్కులు, బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌ స్కెచ్‌ ప్రకారం పెద్ద మొత్తంలో హక్కులను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్‌ పోటీ పడుతున్నారు. మొత్తంగా ఈ చిత్రం బిజినెస్‌ మాత్రమే కాదు.... మొత్తం మీద 'బాహుబలి- దికన్‌క్లూజన్‌' చిత్రం ఏకంగా వేయి కోట్లు వసూలు చేయడం ఖాయమని, బాలీవుడ్‌ను తలదన్నే రీతిలో ఈచిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అదరగొట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఈ చిత్రంతో 'రోబో2.0' ఏమాత్రం పోటీ పడుతుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ