వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ చిన్న హీరోలతో మొదలెట్టి పెద్ద పెద్ద హీరోలతో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన సినిమాల్లో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. మంచి ఊపు మీద ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలన్న చందంగా దూసుకుపోతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
సంపాదించుకునేటప్పుడే మంచి స్థిరమైన వ్యాపారంలో కూడా పడాలని భావిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. అందుకు అనుగుణంగా అడుగులు కదుపుతుంది. టాలీవుడ్ లో మంచి గిరాకీతో కిరాక్ వంటి సినిమా అఫర్లతో చేసేసుకుంటూ పోతున్న రకుల్ మరోవైపు నుండి అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టిందని టాక్. మరికొంత పెట్టుబడి పెట్టి తమ తమ్ముడితో కలిసి ఎఫ్-45 అనే జిమ్ కు సంబంధించి ఫ్రాంచైజీ కూడా తీసేసుకుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ బిజినెస్ లో చొరబడటమే ఆలస్యం ఒకటి తర్వాత ఒకటి మొదలెట్టేస్తుంది. గచ్చిబౌలిలో పెట్టిన జిమ్ బాగా వర్క్ అవుట్ అవుతుండటంతో బెంగుళూరు, పూణె వంటి చోట్ల స్థానికంగా ఉన్న వాళ్ళతో కలసి భాగస్వామిగా చేరి అలాంటి జిమ్ లనే పెట్టాలని చూస్తుంది. ఆ దిశగా బిజినెస్ లో బాగా రాణించాలని కోరుకుంటుందీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.