Advertisementt

ఐష్ కి అప్పుడు కాదు ఇప్పుడు అసలు కష్టాలు!

Fri 07th Oct 2016 08:04 PM
aishwarya rai,ranbir kapoor,salman khan,bachchan family,abhishek bachhan unhappy with aish decision,actress aishwarya rai  ఐష్ కి అప్పుడు కాదు ఇప్పుడు అసలు కష్టాలు!
ఐష్ కి అప్పుడు కాదు ఇప్పుడు అసలు కష్టాలు!
Advertisement
Ads by CJ

ఈ మధ్యన అందాల భామ ఐశ్వర్య తరుచూ వార్తలోనే ఉంటుంది. కారణం ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే. ఆమె ఒకప్పుడు  బాలీవుడ్ టాప్ హీరోయిన్. తర్వాత కెరీర్ పీక్ లో ఉండగానే అమితాబ్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టి అభిషేక్ బచ్చన్ కి భార్య అయ్యింది. ఒక పాపకి తల్లి కూడా అయ్యింది. ఇక ఈమె పెళ్ళికి ముందు చాలా ప్రేమాయాణాలే నడిపింది. అయితే పెళ్లి తర్వాత బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా ఆమె తన భాద్యతలు నిర్వర్తిస్తూ గృహిణిగా మారిపోయింది. ఇక కూతురు ఆరాధ్య కొంచెం పెద్దది అవ్వడం తో ఈమె చూపు మళ్ళి సినిమాలపై పడింది. ఆమె పెళ్ళై కూతురు పుట్టినా కూడా ఏమాత్రం అందం తగ్గకుండా మునుపటి మాదిరిగానే మంచి వర్ఛస్సుతో వెలుగుతూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఇక సినిమాల్లో నటించడం మొదలు పెట్టాక గ్లామర్ కి తగ్గకుండా అందాల ఆరోబోతకి... లిప్  లాక్ కిస్ లకి అన్నిటికి  సిద్ధమవ్వాలి. అందులోనూ బాలీవుడ్ సినిమాలంటే ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. మరి ఐశ్వర్య మాత్రం పెళ్లైయ్యాక మడికట్టుకుని కూర్చుంటానంటే ఆమె కు మాత్రం ఆఫర్స్ ఎలా వస్తాయి. అందుకే గ్లామర్ కి, రోమాంటిక్ సీన్స్ కి నో చెప్పకుండా అన్నిటికి సిద్ధపడింది. అయితే ఈ విషయం లో బచ్చన్స్ ఫ్యామిలిలో కొన్ని విభేదాలు పొడచూపాయని అంటున్నారు. ఇక ఐశ్వర్య తాజాగా నటించే సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' తో ఈ విభేదాలు మొదలయ్యాయని  అంటున్నారు. ఈ సినిమాలో తన కన్నా చిన్నవాడైన రణబీర్ కపూర్ తో ఐష్ రోమాన్స్ సీన్స్ లో రెచ్చిపోయిందని.... లిప్ లాక్ సీన్స్ లో కూడా వీరి రొమాన్స్ తార స్థాయికి వెళ్లిందని కొన్ని ట్రైలర్స్ లో అర్ధమయ్యింది. ఇక ఈ విషయం లో అమితాబ్, జయ కు బాగా కోపం వచ్చిందని... ఐశ్వర్యని మందలించారనే టాక్ బయటికి వచ్చింది. ఇక అప్పటినుండి వారి ఫ్యామిలిలో గొడవలు స్టార్ట్ అయ్యాయని ప్రచారం మొదలైంది.

అదలా ఉంటే ఇప్పుడు ఐశ్వర్య తీసుకున్న ఒక నిర్ణయం వల్ల తన భర్త అభిషేక్ తో కూడా ఐష్ కి విభేదాలొచ్చాయని అంటున్నారు. ఆ నిర్ణయం ఐశ్వర్య తన మాజీ ప్రేమికుడు సల్మాన్ తో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడమేనట. మరి ఐష్ పెళ్లి దగ్గరనుండి ఐశ్వర్య మాజీ ప్రేమికుడు సల్మాన్ కి దూరం గా ఉంటూ వచ్చారు బచ్చన్ ఫ్యామిలీ వాళ్ళు. మరి ఇప్పుడు తాజాగా ఐష్.. సల్మాన్ తో  నటించడం బచ్చన్ ఫ్యామిలీకే కాదు భర్త అభిషేక్ కూడా అస్సలు నచ్చలేదని అందుకే వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. పాపం మాజీ ప్రేమికుడు వల్ల ఐశ్వర్య కష్టాల్లో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరి అభిషేక్ కి ఇష్టం లేకుండా సల్మాన్ తో ఐష్ నటిస్తుందా లేక భర్త వద్దన్నాడని మానేస్తుందో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ