Advertisementt

ఎన్టీఆర్ తర్వాత చిత్రం ఈ దర్శకుడితోనా..!!

Sat 08th Oct 2016 08:27 PM
jr ntr,raghavendra rao,jr ntr movie with raghavendra rao,namo venkatesaya movie  ఎన్టీఆర్ తర్వాత చిత్రం ఈ దర్శకుడితోనా..!!
ఎన్టీఆర్ తర్వాత చిత్రం ఈ దర్శకుడితోనా..!!
Advertisement
Ads by CJ

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప్రస్తుతం నాగార్జునతో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భక్తిరస చిత్రం గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వర స్వామి భక్తుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ జోనర్ లో నాగార్జునతో 'అన్నమయ్య, శ్రీరామదాసు' చిత్రాలను తీసిన రాఘవేంద్రరావు ఇప్పుడు నాగార్జున హీరోగా 'ఓం నమో వేంకటేశాయ' తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం తర్వాత రాఘవేంద్రరావు  జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని అంటున్నారు. 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తో చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కె.రాఘవేంద్రరావు కి ఎన్టీఆర్ కి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. మరి కరెక్ట్ గా వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనేది మాత్రం తెలీదు. అయితే ఎన్టీఆర్ ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ కి కమిట్ కాలేదు గనక ఈ కాంబినేషన్ లో ఖచ్చితంగా సినిమా ఉంటుందని అంటున్నారు. 

ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. మరి ఈ సినిమా పౌరాణికమా లేక సోషియో ఫాంటసీనా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. మరి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో  సినిమా వస్తే ఎన్టీఆర్ కెరీర్ కి బాగా ప్లస్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ