Advertisementt

సెంటిమెంట్‌ ప్రకారమే శాతకర్ణి లుక్‌ !

Sun 09th Oct 2016 08:34 PM
gautamiputra satakarni,sentiment,balakrishna,nandamuri taraka ramarao,gpsk  సెంటిమెంట్‌ ప్రకారమే శాతకర్ణి లుక్‌ !
సెంటిమెంట్‌ ప్రకారమే శాతకర్ణి లుక్‌ !
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ శాతకర్ణి గెటప్‌ పట్ల ఆయన అభిమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుండి బాలయ్య గెటప్‌ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. నిజానికి బాలయ్యకు ఎలాంటి గెటప్‌ అయినా సరే పక్కాగా కుదురుతుందనేది అభిమానుల నమ్మకం. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు కాబట్టి విజయదశమికి టీజర్‌ రిలీజ్‌ చేయడం సబబే. టీజర్‌తో పాటుగానే ఫస్ట్‌లుక్‌ సైతం వస్తుందని భావిస్తే మూడు రోజుల ముందుగానే అంటే శనివారం రిలీజ్‌ చేశారు. దీనికి ప్రత్యేక కారణం ఉందని యూనిట్‌ వర్గాలు అంటున్నాయి. తండ్రిలాగే బాలకృష్ణకు సైతం 9 సెంటిమెంట్‌ ఉంది. ముహూర్తం ప్రకారం ఆయన నడుచుకుంటారు. బాలకృష్ణ సెంటిమెంట్‌కు అనుగుణంగా శనివారం 9 సంఖ్య కలిసివస్తుంది. (8-10-2016 అన్నీ కలిపితే 9 వస్తుంది) అందుకే ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ