సునీల్ హీరో అవతారమెత్తాక కమెడియన్ పాత్రలకు నో చెబుతున్న విషయం తెలిసిందే. కానీ ఆయన నటించిన పలు చిత్రాలు వరసగా నిరాశపరుస్తుండటం సునీల్‌నే కాదు,ఆయన సన్నిహితులకు కూడా బాధని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సునీల్ తాను తెలుగులో మాత్రం కెమెడియన్‌గా తప్ప ఎందులోనూ తనను ప్రేక్షకులు ఒప్పుకోరని, ఇతర భాషల్లో అయితే విలన్‌గా కూడా చేయాలనుందని విన్నవించాడు కూడా. కాగా తాజాగా విడుదలైన సునీల్ ఈడు గోల్ద్‌ఎహెకు కూడా కేవలం యావరేజ్ టాక్‌నే మిగిల్చింది. ఇక ఇప్పుడు సునీల్ తన మైండ్‌సెట్‌ను మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రసుతం ఆయన మెగాస్టార్ 150 వచిత్రంగా రూపొందుతున్న ఖైదీనెం 150 లో చిరుకు స్నేహితుడిగా ఓ పాత్రను చేస్తున్నాడు. ఇక తాజాగా సునీల్ స్నేహితుడు, ఆప్తుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కోసం సిద్దం చేస్తున్న సబ్జెక్ట్‌లో పవన్ స్నేహితుడిగా ఓ ఫ్రెండ్ పాత్రను క్రియేట్ చేసి అందులో సునీల్‌కు అద్భుతమైన రోల్ క్రియేట్ చేస్తునట్లు తెలుస్తోంది. సాధారణంగా పవన్ చిత్రంలో ఆయన ఫ్రెండ్ అంటే కేవలం అలీ మాత్రమే కనిపిస్తాడు. అయితే త్రివిక్రమ్ మాత్రమే ఈసారి ఈ పాత్రను సునీల్ కోసం ఎంతో కష్టపడి ఆయన పాత్ర కూడా సినిమాలో హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి ఇప్పుడు సునీల్ మెగా హీరోలైన అన్నదమ్ములిద్దరికీ స్నేహితునిగా నటించేందుకు ఒప్పుకున్నాడని విశ్వసనీయ సమాచారం.