Advertisementt

సునీత జీవితానికి అద్దం పట్టేలా ఈ షార్ట్ ఫిల్మ్..?

Mon 10th Oct 2016 07:21 PM
singer suneetha,sunitha,ragam short film,srichaithu direction  సునీత జీవితానికి అద్దం పట్టేలా ఈ షార్ట్ ఫిల్మ్..?
సునీత జీవితానికి అద్దం పట్టేలా ఈ షార్ట్ ఫిల్మ్..?
Advertisement
Ads by CJ

తొలిసారిగా సింగర్ సునీత, శ్రీ చైతు దర్శకత్వం వహించిన రాగం అనే షార్ట్ ఫిలింలో కనిపించింది.  ఈ షార్ట్ ఫిలింను జనాలు తెగ చూసేస్తున్నారు. గత కొంత కాలంగా ఎంతో మంది దర్శకులు తమ  సినిమాలోనూ, షార్ట్ ఫిలిమ్ లోనూ నటించమని అడిగుతున్నా కాదు కూడదంటూ నెట్టకొస్తున్న సునీత ఈ షార్ట్ ఫిల్మ్ కు ఎలా ఒప్పుకుందబ్బా అని ఆసక్తిని రేకెత్తిస్తుంది.  కాగా రాగం అనే షార్ట్  ఫిలిం మొత్తం సునీత జీవితానికి సంబంధించిందిగా తెలుస్తుంది.

సునీత జీవితాన్ని తేట తెలతెల్లపరిచేదిగా ఈ కథ  ఉంది కాబట్టే సునీత ఇందులో ఒప్పేసుకున్నట్లు తెలుస్తుంది. స్వతంత్రంగా ఎదుగుతూ ఒంటరిగా ఓ మహిళ తన కాళ్ళ మీద తాను ఎలా నిలుచున్నదన్నదే ఈ షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఉన్న కొన్ని విషయాలను చూస్తే  ఎక్కడికి వెళ్లొస్తుందో... అంటూ సాగదీస్తూ తెలిపే డైలాగ్ లు, అదే ఆమెకు అవకాశాలు వచ్చినప్పడు బాసుతో క్లోజ్ గా ఉందిలే.... అంటూ  చేసే కామెంట్లు ఇవన్నీ ఈ షార్ట్ ఫల్మ్ లో మనకు దర్శనమిస్తాయి. ఓ రకంగా ఓ మహిళ ఒంటరి పోరాటాన్ని ఈ చిన్న ఫిల్మ్ లో చిత్రీకరించడం జరిగింది. భర్త నుంచి విడిపోయి పిల్లలని పోషించుకుంటూ స్వతంత్రంగా జీవితాన్ని చాలా విలాసంగా, దర్జాగా బ్రతుకీడుస్తున్న సినీతా తల్లి తండ్రుల నీడలో ఉంటుంది. నిజంగా సునీత నిజ జీవితానికి ఈ ఫిల్మ్ అద్దం పట్టిందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ