తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతురావుకి ఈ మధ్య పబ్లిసిటీ పిచ్చి పట్టినట్లుంది. తరుచూ వార్తల్లో వ్యక్తిగా దర్శనమిస్తున్నాడు. మొన్నీమధ్య పోసాని కృష్ణ మురళితో టీవీ ఛానెల్ లో గొడవపడి మరీ అందరి నోళ్ళలో నానిన వి.హెచ్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకొచ్చాడు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించి మరొక్కసారి హైలెట్ అయ్యాడు.
పవన్ పెట్టిన జనసేన పార్టీ అసలు పార్టీనే కాదని సంచలనాత్మకంగా మాట్లాడాడు. ఏపీలో ఉన్నవి రెండు పార్టీలేనని అవి టిడిపి, వైసిపిలు మాత్రమే అని అన్నాడు. ఇక మూడవ పార్టీ ఏమైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని తెలిపాడు హనుమంతరావు. అంతేకాని జనసేన పార్టీ ఏపీలో మూడవ పార్టీ అని చెప్పకూడదని, అది అసలు పార్టీనే కాదని తేల్చేశాడు హనుమంతన్న. ఇక చంద్రబాబుని, బిజెపి వాళ్ళని పవన్ ఎంతగా విమర్శించినా కూడా వారికి అనుకూలంగానే ఉంటాడు గాని వారితో విభేదాలు పెంచుకోడని కొన్ని విషయాలు చూస్తే అర్ధమవుతుందని అని కూడా వెల్లడించాడు. ఆ విషయాలు కూడా ఏమిటనేది బయటటకు చెప్పి మరీ అందరిని ఆశర్యపరిచాడు. అవేమిటంటే పవన్ కాపు కులస్తుడైనప్పటికీ కాపులకి అనుకూలంగా ఏం చెయ్యడం లేదని, వారికి అసలు మద్దతు కూడా ఇవ్వడం లేదని అన్నాడు. అందుకే కాపు ఉద్యమానికి పవన్ మద్దతివ్వకుండా గమ్మునున్నాడని చెప్పేశాడు హనుమంతన్న. ఇక ఎలాగూ చంద్రబాబు కాపు ఉద్యమాన్ని అణిచివేయ్యడానికి సకల విధాలా ప్రయత్నిస్తున్నాడని, మరి కాపు కులం నుండి వచ్చిన పవన్ మాత్రం ఇదేమిటని బాబుని ప్రశ్నించకపోగా సైలెంట్ గా సినిమాలు తీసుకుంటున్నాడని ఎద్దేవా చేసాడు.
పవన్ విషయాలతో పాటు ఆయన సీనియర్ ఎన్టీఆర్ గురుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఆ కాలంలో ఎన్టీఆర్ ఒక కమిట్మెంట్ వున్న నాయకుడని, ఈ కాలంలో సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులంతా కేవలం టచ్ అప్ నాయకులని సంచలనాత్మకంగా మాట్లాడాడు. అలాగే పవన్ కి అసలు కమిట్మెంటే లేదని, ఉంటే ముద్రగడ కాపు ఉద్యమానికి మద్దతిచ్చేవాడని, ఆ రకంగా కాపులకి అన్యాయం జరగకుండా పవన్ కాపాడేవాడని అంటున్నాడు హనుమంతరావు.