Advertisementt

ప్రియాంక టీ షర్ట్ పై లొల్లి..!

Tue 11th Oct 2016 12:53 AM
priyanka,balywood actress priyanka chopra,travellor magazine,halywood actress priyanka chopra  ప్రియాంక టీ షర్ట్ పై లొల్లి..!
ప్రియాంక టీ షర్ట్ పై లొల్లి..!
Advertisement
Ads by CJ
బాలీవుడ్ నుండి  హాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత ప్రియాంక చోప్రా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఎపుడూ ఏదో ఒక విధంగా వార్తల్లోకెక్కుతున్న ప్రియాంకా తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. అదేమిటంటే  ట్రావెలర్ మేగజైన్ కోసం ప్రియాంక వేసుకున్న టీ షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటి టీ షార్ట్ వేసుకుంటే వివాదం ఏంటీ అనుకుంటున్నారా! మీరే చూడండి. ఆమె  ట్రావెలర్ మేగజైన్ కవర్ పేజీ కోసం చేయించుకున్న ఫోటో షూట్ పిక్ ని ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేసింది. అది మొదలు ప్రియాంకపై నెటిజెన్లు ఒక రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. ఆమె వేసుకున్న టీ షర్ట్ గురించే  అందరూ తెగ కోపంగా మాట్లాడుకుంటున్నారు. 
అసలు టీ షర్ట్ పై వాళ్లకి అంతగా కోపం రావడానికి కారణం ఏంటంటే... ప్రియాంక ధరించిన వైట్ టీ షర్ట్ పై రెఫ్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటివాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు రాసి వున్నాయి. ఇక అందులో వున్న  రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను మాత్రమే కొట్టేసి ఒక్క ట్రావెలర్ అనే పదం మాత్రం అలాగే వదిలేసింది. అసలు అలా రాయడం ఎందుకు ఇలా కొట్టేయడం ఎందుకు అని వారు చాల కోపంగా అడుగుతున్నారు. వలసదారులు, ఇంకా ఇతర దేశాలకు తరలిపోయే వారిని ఈ పదాలు కించపరిచేలా ఉన్నాయని మండి పడుతున్నారు. కేవలం ఒక్క డబ్బు కోసమే ఆలోచించకుండా కొన్ని విషయాలను ఆలోచించాలని ప్రియాంకకి ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేస్తున్నారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ