Advertisementt

సభాముఖంగా అలా దుఖించిన స్టార్ హీరోయిన్..!

Wed 12th Oct 2016 03:39 PM
ballywood star heroine deepika padukone,live love lough programme,deepika padukone meeting  సభాముఖంగా అలా దుఖించిన స్టార్ హీరోయిన్..!
సభాముఖంగా అలా దుఖించిన స్టార్ హీరోయిన్..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకునే బాగా ఎమోషన్ ఫీలయ్యింది. సభా ముఖంగా సభికుల సమక్షంలో తన భాధను ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకొంది. ఒకానొక సందర్భంలో మానసికమైన ఒత్తిడి తనను ఎలా కుంగదీసిందో వెల్లడిస్తూ ఏడ్పాపుకోలేకపోయింది. తాజాగా లివ్ లవ్ లాఫ్అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మానసిక వేదన అనుభవిస్తున్న వారికి చేయూతనందించే కార్యక్రమంలో ప్రసంగిస్తూ దీపికా మానసిక ఒత్తిడి గురించి ప్రస్తావించి తనకు సంభవించిన ఘటనను నెమరువేసుకుంది.

దీపికా ఏం ప్రస్తావించారంటే ఒక సారి మా అమ్మ, నాన్న, సోదరి తన దగ్గరకు వచ్చి, తిరిగి వెళ్ళడానికి అంతా సిద్ధమౌతున్నారు. తాను మాత్రం మౌనంగా తన బెడ్ మీద కూర్చోని ఉందట. ఆ సమయంలో అమ్మ వచ్చి ఏమైంది అలా ఉన్నావ్ అని అడిగింది. తాను బాగానే ఉన్నానని చెప్పిందట. కానీ మళ్ళీ అమ్మ దేని గురించైనా భాదపడుతున్నావా అని అడిగింది, అప్పటికీ ఆ విషయం ఏంటో తాను చెప్పలేదు. అమ్మ మళ్ళీ మళ్ళీ అడిగింది. అప్పుడిక ఒక్కసారిగా తనలోని దుఃఖమంతా బయటకొచ్చేసింది. అంత బాధలో ఉన్న నన్ను వాళ్ళే మామూలు మనిషిని చేశారు. అమ్మ, నాన్న, సోదరి, స్నేహితులు ఇలా అందరూ తనకు ధైర్యం చెప్పడం వలనే ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటూ వెల్లడించింది దీపికా. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. అందరూ జాగ్రత్తగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని అర్థం చేసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది అంటూ కన్నీటితోనే మాట్లాడేసింది దీపికా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ