Advertisementt

రాజమౌళి పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!

Wed 12th Oct 2016 07:53 PM
rashmi gautham,etv,jabardasth,ss rajamouli,rashmi about rajamouli  రాజమౌళి పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!
రాజమౌళి పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!
Advertisement
Ads by CJ

రష్మీ గౌతమ్. ఈవిడగారికి ఒక్క జబర్దస్త్ ప్రోగ్రాం తోనే సుడి తిరిగి ఏకం గా హీరోయిన్ గా మారిపోయింది. ఇక బుల్లితెరమీద తన ఒంపుసొంపులతో, వచ్చిరాని తెలుగుతో యాంకరింగ్ చేస్తూ...... చిన్న చిన్న బట్టలు వేసుకుని కుర్రకారుని తన వైపుకు తిప్పుకున్న రష్మీ... అటు వెండితెరమీద కూడా తన అందాల ఆరబోతతో హాట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు  తనకెరీర్ ని మలుపు తిప్పే ప్రపోజల్ వచ్చినా కూడా జబర్దస్త్ ని వదిలి వెళ్లనని అంటుంది. అంతగా జబర్దస్త్ తనకి పేరుని తీసుకొచ్చిందని అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ టీవీ జబర్దస్త్ ని వదులుకోనని ఖరాఖండిగా చెప్పేసింది.  అంతే కాదు దర్శకధీరుడు రాజమౌళి అంతటివాడు పిలిచి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానన్న జబర్దస్త్ ప్రోగ్రాం ని వదిలి వెళ్ళలేనని చెబుతుంది ఈ భామ. తనకెన్ని సినిమాల్లో నటించినా రాని పేరు ఒక్క ఈ టీవీ జబర్దస్త్ వల్లే వచ్చిందని అందుకే ఎంత మంచి ఆఫర్ని వదులుకోవడానకైనా సిద్ధమని అంటుంది. మరి రష్మీ.. రాజమౌళి పిలవక పోయినా ఇలా మాట్లాడిందంటే... ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందేమో అని ఇప్పటినుండే రాజమౌళిని ఇండైరెక్టుగా కాక పట్టే పనులు చేసేస్తుందని అంటున్నారు. లేకపోతె రాజమౌళి తన సినిమాలో ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ ఒదులుకుంటానని మాట్లాడుతుందా అసలు. ఆమె వ్యాఖ్యలు విన్నవారంతా..అమ్మో రష్మీ చాలా ముదురు బాబోయ్ అంటూ  చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ