Advertisementt

ప్లాప్ దర్శకుల పాలిట వరంగా నాని..?

Thu 13th Oct 2016 05:23 PM
hero nani,director venu sriram,producer dilraju,indrakanti director nenu local hero nani  ప్లాప్ దర్శకుల పాలిట వరంగా నాని..?
ప్లాప్ దర్శకుల పాలిట వరంగా నాని..?
Advertisement
Ads by CJ

తెలుగు సినీ పరిశ్రమకు హీరో నాని నిర్మాతల దర్శకుల పాలిట కల్పవృక్షంగా మారాడు. ఎటువంటి కథనైనా తనదైన శైలిలో ఆసక్తికరంగా, రక్తికట్టించే ఏకైక ధీరుడుగా దర్శక నిర్మాతలకు కనబడుతున్నాడు. అస్సలు టాలీవుడ్ నాని అంటేనే ఎంతలో ఎంతలేదన్నా పెట్టిన పెట్టుబడి కంటే అదనంగానే సంచిలో రాలుతాయి అనేది టాలీవుడ్ విశ్వాసంగా నడుస్తుంది. అలాంటిదన్నమాట ప్రస్తుతం  నానికి ఉన్న రేంజ్. అలా సినిమా ప్రారంభం కాగానే ఇలా బిజినెస్ మొద‌లైపోతుందనేది ఆయనపై ఉన్న నమ్మకం. ఒకరకంగా చెప్పాలంటే హీరో నాని నిర్మాత‌ల పాలిట వరంగా, కొంగు బంగార‌మయ్యాడనే చెప్పాలి.

ఇప్పుడున్న నాని రేంజ్ కి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేయగలడు. కానీ వస్తువును కొత్తదనంతో నటనను పోషించేలా కాస్త ప్రేక్షకుల సేదను తీర్చేలా ఉన్న కథలనే ఎంచుకుంటున్నాడు. అలా కొత్త కొత్త దర్శకులను నిర్మాతలను భుజం తట్టి మరీ ప్రోత్సహిస్తున్నాడు. అయితే తాజాగా నాని ఓ ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అతడెవరో కాదు వేణు శ్రీ‌రామ్‌. దిల్‌రాజు కాంపౌండ్ నుంచి పరిచయమై ఓమై ఫ్రెండ్ సినిమా తీసిన వేణు శ్రీరామ్. సిద్దార్థ్‌శ్రుతిహాస‌న్‌హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో వేణు శ్రీ‌రామ్ కి ఐదేళ్లుగా సినిమా ఛాన్సే లేక అల్లల్లాడి పోతున్నాడు.  కాగా తాజాగా వేణు శ్రీ‌రామ్ వద్ద ఉన్న ఓ క‌థను నానికి వినిపించినట్లు టాక్ నడుస్తుంది. నాని కూడా ఆ కథకు ఓకే చెప్పినట్లు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. అయితే ఈ సినిమాని కూడా దిల్‌రాజే తెర‌కెక్కించనున్నాడని వినికిడి. ప్రస్తుతం నేను లోకల్ అనే చిత్రం కూడా దిల్ రాజు బ్యాన‌ర్ పైన నుండే వ‌స్తుంది. ఆ వ‌రుస‌లో ఇది రెండో సినిమా.

అయితే నాని గతాన్ని కొంత తరచి జాగ్రత్తగా చూస్తే అష్టాచ‌మ్మా తీసిన ఇంద్ర‌గంటికి ఆ త‌ర‌వాత ఫ్లాప్ లు ఎదురైతే  జెంటిల్‌మెన్‌ గా ఆయనకు అవకాశాన్నిచ్చి మరీ హిట్టూ కొట్టాడు. ఇప్పుడు కూడా అలాంటి అవకాశాన్నే వేణు శ్రీ‌రామ్ కి కూడా నాని ఇచ్చినట్లు తెలుస్తుంది. పైగా దిల్ రాజు బ్యానర్ కాబట్టి గుండె నిబ్బరంగా ఇచ్చేయచ్చొన్నది నాని నమ్మకం కాబోలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ