చిరంజీవి 150 చిత్రం 'ఖైదీ నెంబర్ 150' వి.వి.వినాయక్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెడదామని అనుకున్న వినాయక్ ఆ దిశగా ఐటెం గర్ల్ వేటలో పడ్డారు. ముందుగా 'ఖైదీ నెంబర్ 150' లో తమన్నా ఒక ఐటెం సాంగ్ చేస్తుందని అన్నారు కానీ తమన్నా ని కాదని కేథరిన్ తెరిస్సా ని తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ తర్వాత కెథెరిన్ ని కూడా కాదని శ్రీయ శరణ్ అయితే బావుంటుందని.... అనుకుని దాదాపు శ్రీయ ని ఫైనల్ చేసేసారు అని అన్నారు. అయితే ఇప్పుడు శ్రీయ కూడా చిరు పక్కన ఐటెం సాంగ్ చెయ్యడం లేదంట. అసలు కెథెరిన్ నే చిరు పక్కన ఐటెం లో నర్తించనుందని అన్నారు.
ఇప్పుడు కొత్తగా చిరు తమ్ముడు పవన్ పక్కన ఐటెం లో మెరిసిన లక్ష్మి రాయ్.. చిరు 150 వ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవనుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఎక్కడా బయటకు రాకుండా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. అయితే చిరు - లక్ష్మి రాయ్ ల మధ్యన ఈ ఐటెం సాంగ్ ని ఈ నెల చివరాఖరులో తెరకెక్కిస్తారని సమాచారం. అసలు కెథెరిన్ ఐటెం సాంగ్ కి ఫిక్స్ అయ్యిందని అన్న ఖైదీ నెంబర్ చిత్ర యూనిట్ ఉన్నట్టుండి కెథెరిన్ ని ఎందుకు తప్పించారో కారణం కూడా ఉందట.
ఇప్పటికే చిరు 150 వ చిత్రం ఐటెం సాంగ్ మొదలైందని కెథెరిన్ ఈ సాంగ్ కి షూట్ కి కూడా హాజరైందని ..... కానీ ఆమె ఆ షూట్ నుండి తప్పుకుందని అంటున్నారు. అసలు కెథెరిన్ తప్పుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. అదేమిటంటే చిరు ఫ్రెండ్ లారెన్స్ తో కెథెరిన్ ఆర్గ్యూ చేసిందని.... లారెన్స్ చెప్పిన స్టెప్స్, మూమెంట్స్ కెథెరిన్ సరిగ్గా చెయ్యకుండా అతనితో గొడవ పడిందని అందుకే ఆమెను తప్పించి వెంటనే లక్ష్మి రాయ్ ని తీసుకున్నారని అంటున్నారు.
మరి కెథెరిన్ కి అసలు ఏం చూసుకుని ఇలా చేసిందో ఇప్పటికి యూనిట్ కి అర్ధం కాలేదంట. చిరు పక్కన ఛాన్స్ ని సరిగ్గా ఉపయోగించుకోలేక టెక్కు చూపించిందని, అందుకే ఛాన్స్ పోగొట్టుకుందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.