Advertisementt

ఈ బాబు కి ఇంక హీరో వేషాలు రానట్లేనా!

Fri 14th Oct 2016 02:05 PM
navdeep,dhruva,jai,gowtham ssc,teja,rana,ram charan  ఈ బాబు కి ఇంక హీరో వేషాలు రానట్లేనా!
ఈ బాబు కి ఇంక హీరో వేషాలు రానట్లేనా!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో 'జై, గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి, చందమామ' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన యంగ్‌ అండ్‌ టాలెంట్‌ హీరో నవదీప్‌. కాగా తేజా ద్వారా పరిచయమైన ఈ హీరో కెరీర్‌ నితిన్‌, గోపీచంద్‌లా సాగుతుందని అందరూ భావించారు. కాగా నవదీప్‌ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ టీవీలో 'సూపర్‌2'కు హోస్ట్‌గా చేస్తున్నాడు. ఇక సోలో హీరోగా అవకాశాలు రాకపోవడంతో ఆయన 'ఆర్య2, బాద్‌షా' చిత్రాలలో సెకండ్‌ లీడ్‌ క్యారెక్టర్లు చేశాడు. అయినా నవదీప్‌ కెరీర్‌ మాత్రం అలానే సో...సో...గా ఉంది. ప్రస్తుతం ఆయన చరణ్‌ నటిస్తున్న 'ధృవ' చిత్రంతో పాటు తనని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందే చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. తనను తేజ స్టార్‌ను చేయలేకపోయినా కనీసం స్టార్‌ హీరో సినిమాలలోనైనా చిన్న పాత్రల్లో అయినా నటించే ఉద్దేశ్యంలో ఉన్నాడు. మొత్తానికి ఇలాంటి ఆఫర్లను, ముఖ్యంగా స్టార్‌హీరో చిత్రాలలో తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేసి మెప్పించాలనే ఉద్దేశ్యంతో నవదీప్‌ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ