ఈ మధ్యన టాలీవుడ్ లో రైటర్స్ హవా పెరిగిపోయింది. వీరు స్టోరీ రైటింగ్ కంటే డైరెక్షన్ మీదనే ఎక్కువ శ్రద్ద కనబరుస్తున్నారు. తాము రాసుకున్న స్టోరీలు తామే తెరకెక్కిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్స్ గా మారిపోతున్నారు. ఇక ఇలా రైటర్స్ నుండి డైరెక్టర్ గా చాలామందే సెట్టిల్ అయ్యారు. వారిలో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నవారు కూడా ఉన్నారు. వారే త్రివిక్రం శ్రీనివాస్, కొరటాల శివ తదితరులు ఉన్నారు. ఇక వీరు డైరెక్టర్స్ కి మంచి కథలను ఇస్తూనే అవకాశం రాగానే డైరెక్టర్ గా ఛాన్స్ కొట్టేసి.... ఇక వేరే వారికి కథలు ఇవ్వడం మానేసి వారి సినిమాల డైరెక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టేసారు. ఇక ఇండస్ట్రీలో స్టోరీ రైటర్స్ కొరత ఏర్పడింది.
అయితే ఎప్పటినుండో ఒక టాప్ రైటర్ కూడా దర్శకునిగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. కానీ అతనికి డైరెక్టర్ గా అవకాశం కన్నా రైటర్గా అవకాశాలే వస్తున్నాయని అంటున్నాడు. కొంతమంది తాను దర్శకుడిగా మారకుండా అడ్డుపడుతున్నారని సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇలా అన్నది ఎవరో కాదు టాప్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్. కోన వెంకట్ మంచి రైటర్ గా అందరికి తెలుసు. కోన ఎప్పటినుండో డైరెక్షన్ చెయ్యాలని కలలు కంటున్నాడు. కానీ అతనికి అవకాశం రాకుండా ఓ ఇద్దరు అడ్డుకుంటున్నారని అంటున్నాడు. ఆ ఇద్దరు రైటర్స్ గా వచ్చి డైరెక్టర్స్ గా సెటిల్ అయిన త్రివిక్రమ్, కొరటాల శివ అంట. అదేమిటి కోనని వీరెందుకు అడ్డుకుంటారు అనుకుంటున్నారా.... అదేనండి అసలు ట్విస్ట్. త్రివిక్రమ్ ఇంకా కొరటాల రైటర్స్ గా చాలామందికి కథలు రాసిచ్చేవారు. కానీ వీరు డైరెక్టర్స్ అయ్యాక స్టోరీ రాసే రైటర్స్ కొరత ఏర్పడి అందరికి కోన నే బెస్ట్ ఆప్షన్ గా ఉండి... అతనితో కథలు రాయించుకోవడానికి మొగ్గు చూపడం వల్ల..... ఇంకా కొన్ని కమిట్మెంట్స్ వల్ల కోన డైరెక్టర్ కాలేకపోయానని వాపోతున్నాడు.
కేవలం వారిద్దరి వల్లే రైటర్స్ కొరత ఏర్పడిందని అందుకే తనని ప్రతి ఒక్కరు ఈ ఒక్క సినిమాకి కథని ఇవ్వండి... ఈ ఒక్క సినిమాకి కథని ఇవ్వండి అని డైరెక్టర్స్ అందరూ తనని ఇబ్బంది పెట్టడం మూలం గా డైరెక్టర్ ని అవ్వలేకపోతున్నాని అంటున్నాడు. ఇక కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసి మరో రెండేళ్లలో కచ్చితం గా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తానని చెబుతున్నాడు. పాపం కోన పరిస్థితి చూసారా ఎలా ఉందొ అని అందరూ ఒకటే గుసగుసలు.