Advertisementt

రష్మీ..అందుకైనా రెడీ అంటోంది..!

Sat 15th Oct 2016 05:20 PM
rashmi gautam,extra jabardasth,rashmi gautam item songs,rashmi ready to item songs  రష్మీ..అందుకైనా రెడీ అంటోంది..!
రష్మీ..అందుకైనా రెడీ అంటోంది..!
Advertisement
Ads by CJ

యాంకర్ రష్మీ ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లోకొస్తుంది. ఆమె అందచందాల ఆరబోతలో ఏ యాంకర్... రష్మీకి సరిపోదు. తన అందాల ఆరబోతతో 'గుంటూరు టాకీస్' లో రెచ్చిపోయిన రష్మీ అదే ఆరబోతతో మరికొన్ని సినిమాల్లో ఆఫర్స్ కొట్టేసింది. ఇక ఈటీవి లో తాను చేసే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ని ఒకవైపు మరో వైపు వెండితెర మీద వెలుగుతూ రెండు చేతులూ సంపాదించేస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం రష్మీ నాకు జబర్దస్త్ మంచి లైఫ్ ఇచ్చిందని ఆ లైఫ్ ని కాదని రాజమౌళి అంతటి వాడు ఆఫర్ ఇచ్చినా జబర్దస్త్  ప్రోగ్రాం ని వదిలి రానని సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. 

మరి అంత పొగరుగా మాట్లాడిన రష్మీ ఇప్పుడు కొత్తగా ఐటెం సాంగ్స్ అయినా లేక  ఏ హీరో సినిమాలో అయినా చిన్న రోల్ చేస్తే చాలని.... ఇక దేనికైనా రెడీ అని... ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసిందట. ఐటెం సాంగ్స్ కి రెడీ అని చెబుతున్న ఆమెకు మరి అవకాశాలు వస్తాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే టాప్ హీరోయిన్స్ అయిన తమన్నా, కాజల్, శృతి హాసన్ తో పాటు లక్ష్మి రాయ్ లాంటి వాళ్ళు ఐటమ్స్ లో దూసుకు పోతున్నారు. మరి అంతటి పెద్ద హీరోయిన్స్ ని కాదని ఎవరైనా రష్మీ లాంటి యాంకర్స్ కి అవకాశం ఇస్తారా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే రష్మీ అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అవకాశం ఇస్తే ఇవ్వొచ్చు అని అంటున్నారు. 

అయినా రష్మీ ఇలా ఐటమ్స్  మీద పడిందేమిటి అసలు.... ఆమధ్య రాజమౌళి ఛాన్స్ ఇచ్చినా వెళ్లనని గీరగా మాట్లాడి హైలెట్ అవుదామనుకుంది. కానీ హైలెట్ సంగతి దేవుడెరుగు అసలుకే మోసం వస్తుందని కాబోలు పాపం..పాప ఇలా ఐటెం బాటని ఎన్నుకుంటుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ