మోస్ట్ బ్యాచులర్ హీరోల్లో ముందు వరసలో ప్రభాస్ ఉంటాడు. మరి ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడా అని ఎంతోమంది అమ్మాయిలు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే 'బాహుబలి 2' పూర్తయ్యేవరకు పెళ్లి లేదని ప్రభాస్ చెప్పేసాడు. అయితే 'బాహుబలి 2' సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పెళ్లి పీటలెక్కడానికి ప్రభాస్ రెడీ అయిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ప్రభాస్ పెళ్లి గురించి అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఒకసారి ప్రభాస్ మీడియా ముందుకు వచ్చిమరీ నాకు అప్పుడే పెళ్ళిచేసుకోవాలని లేదని... అసలు ఈ పెళ్లి వార్తలన్నీ అవాస్తవాలని ప్రెస్ మీట్ పెట్టిమరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు వచ్చిన వార్త అయిన నిజమేనా లేక మళ్ళీ రూమరేనా అంటే కాదు ఈసారి నిజమనే సంకేతాలు ప్రభాస్ కుటుంబం నుండి వస్తున్నాయని సమాచారం.
ఇక ప్రభాస్ పెళ్లి వార్తలకు ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభాస్ ఫ్యామిలీ భావిస్తోందట. అందుకే ప్రభాస్ పర్మిషన్ తీసుకుని మరీ అయన పెదనాన్న కృష్ణం రాజు... ప్రభాస్ కి పిల్లని వెతికే వేటలో పడ్డాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక 'బాహుబలి 2' షూటింగ్ పూర్తయ్యేలోపల ఎలాగైనా ఒక వధువుని ప్రభాస్ కి సెట్ చెయ్యాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. మరో పక్క వధువు దొరికేసిందని... ఆమెది వైజాగ్ అని దాదాపు అమ్మాయి ఫైనల్ అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఇక ప్రభాస్ 'బాహుబలి 2' షూటింగ్ కంప్లీట్ చేసుకోవడమే తరువాయి పెళ్లి ముహుర్తాలు పెట్టించేస్తారని అంటున్నారు. మరి ఈ విషయమై ప్రభాస్ గాని అయన పెదనాన్న కృష్ణంరాజు గాని ఎక్కడా ప్రస్తావించలేదు.
ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి 2017 లో ఖచ్చితం గా ఉంటుందనేది ఈ వార్తల సారాంశం. ఈ వార్తలు వింటున్న ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఫుల్ ఖుషిగా పండగ చేసుకుంటున్నారు.