యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో నందమూరి, కొణదెల హీరోల మధ్య మంచి రసవత్తర పోటీ జరుగుతోంది. విజయదశమి నుండి బాలకృష్ణ, చిరంజీవి టీజర్, ప్రోమోలు హల్ చెల్ చేస్తున్నాయి. వీటిలో ఎక్కువ మంది వీక్షించిన రికార్డ్ ఎవరికి సొంతమైందో తెలుసుకుందాం.
'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర నిర్మాతలు దసరా రోజున విడుదల చేశారు. అంతకుముందే బాలకృష్ణ శాతకర్ణి గెటప్ రిలీజ్ చేయడంతో, టీజర్ పట్ల క్రేజ్ నెలకొంది. నాలుగు రోజుల్లో రెండు మిలియన్ల మంది వీక్షించారని చిత్ర యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఇది రికార్డ్ అని వారు పేర్కొన్నారు. ఒక సీనియర్ హీరో సినిమా టీజర్‌కు ఇంతటి క్రేజ్ రావడం విశేషం.
ఇక మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెరపై వ్యాఖ్యాతగా కనిపించనున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు సంబంధించి ప్రోమోను 'మా' టీవీ విడుదల చేసింది. ఈ రియాలిటీ షోలో చిరంజీవి ఎలా కనిపిస్తారు?, ఎలా నిర్వహిస్తారనే !! ఆసక్తి చాలామందిలో ఉంది. అయినప్పటికీ ప్రోమోలను వీక్షించిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఈ వ్యత్యాసం చిరు అభిమానులు గమనించినట్టు లేరు.
'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా, చిరంజీవిది టీవీ రియాలిటీ షో కాబట్టి ఈ రెండింటిని పోల్చకూడదనుకోవచ్చు. కానీ హీరోలుగా ఇద్దరు అగ్రస్థానంలో ఉన్నారు. స్టార్ హీరోలు ఏది చేసినా, అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి పోల్చకతప్పదు.