ఆంధ్రప్రదేశ్ లో నల్లధనంపై రాజకీయం చాలా హాట్ హాట్ గా నడుస్తుంది. అది నాయకుల మధ్య హీట్ ను రేపుతుంది. చంద్రబాబు నాయుడు నల్లధనంపై ప్రకటించిన అభిప్రాయంతో ప్రారంభమైన ఆ వేడి రోజా తాజా కామెంట్లతో హీట్ పెరిగిపోతుంది. లోకేష్ బ్యాటరీ లేని సెల్ ఫోన్ అంటూ రోజా మాట్లాడిన వైనాన్ని తెలుపుతూ తెదేపా నాయకుడు ఎమ్మెల్సీ అయిన బుద్ధా వెంకన్న మండిపడ్డాడు. రోజాపై అవకాశం వస్తే మహిళ అని కూడా చూడకుండా విరుచుకు పడాల్సి వస్తుందని అన్నాడు. అసెంబ్లీ సమావేశాల నుండి సంవత్సరం పాటు సస్పెండ్ అయిన కూడా ఇంకా రోజాకి సిగ్గు లేకుండా పోయిందంటూ ఆయన ధ్వజమెత్తాడు. లోకేష్ ను రోజా తీవ్రంగా దూషించడంపై ఆయన విరుచుకు పడ్డాడు. రోజా పెయిడ్ వర్కర్ గా చిత్రిస్తూ వీరలెవల్లో చెలరేగిపోయాడు బుద్ధా వెంకన్న. వైకాపా పార్టీకి, అలాగే జబర్దస్త్ ప్రోగ్రామ్ కి రోజా పెయిడ్ వర్కర్ అయి పోయిందంటూ ఆయన వివరించాడు.
తెదేపా నాయకుడు చంద్రబాబుకు వీరవిధేయుడైన బుద్ధా వెంకన్న మాట్లాడుతూ లోకేష్ శ్రీరామచంద్రుడు వంటి వాడని అటువంటి వ్యక్తిని పట్టుకొని అనరాని మాటలు రోజా అనడం సబబు కాదని ఆయన వివరించాడు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండే పదేళ్ళ పాటు ఏపీ పాలన చేసే సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి అమరావతి కేంద్రంగా ప్రజలకు అందుబాటులో పాలన చేస్తున్నాడని, అదీ ప్రజలందరినీ మెప్పించేలా పరిపాలిస్తున్నాడని ఆయన వివరించాడు. ఇంకా రోజా లాంటి పెయిడ్ వర్కర్స్ మాటలను తమ పార్టీ నాయకులు పట్టించుకోరని కూడా బుద్ధా వెంకన్న వివరించాడు.