Advertisementt

టాక్ అఫ్ ది హీరో ఇతనే..!

Sun 16th Oct 2016 10:32 PM
talk of the hero,vijay devarakonda,pelli choopulu,trivikram,big banners  టాక్ అఫ్ ది హీరో ఇతనే..!
టాక్ అఫ్ ది హీరో ఇతనే..!
Advertisement
Ads by CJ

తెలుగులో ఇటీవలి కాలంలో చూసుకుంటే ఓ ఉదయ్‌కిరణ్‌, తాజాగా నాని, రాజ్‌తరుణ్‌, నిఖిల్‌ వంటి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్యాగ్రౌండ్ పెద్దగా లేకపోయినా వీరు హీరోలుగా రాణించారు. ప్రస్తుతం ఇప్పుడు అదే కోవలోకి మరో హీరో వచ్చి చేరాడు. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంలో ఓ చిన్న పాత్ర చేసిన విజయ్‌ దేవరకొండ 'పెళ్ళిచూపులు' చిత్రం ద్వారా బిజీ బిజీగా మారిపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ నటించిన ఆర్‌.బి.చౌదరి నిర్మాణంలో సిద్దమవుతున్న'ద్వారక' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈచిత్రం మోషన్‌ పోస్టర్‌ను ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి తన చేతుల మీదుగా విడుదల చేశాడు. ఇక ఈ చిన్న హీరోకు ఇప్పుడు పెద్దపెద్ద బేనర్ల నుండి అవకాశాలు వస్తున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నిర్మాతగా మారి రూపొందించనున్న చిత్రంలో ఈయనే హీరోగా చేయనున్నాడు. ఇక సురేష్‌ ప్రొడక్షన్స్‌తో పాటు సాయి కొరటాల వారాహిచలన చిత్రం బేనర్‌లో మరో రెండు చిత్రాలు చేయనున్నాడు. ఇక అశ్వనీదత్‌ బేనర్‌లో కూడా విజయ్‌ దేవరకొండ ఎంపికయ్యాడు. చేసే దర్శకులు ఎవరైనా పెద్దపెద్ద బేనర్లు లో విజయ్ కి అవకాశాలు వస్తుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ