కమేడియన్ హీరో అయితే ఫలితం జీరో అవుతుంది. హీరోగా చేసిన ఒకటి, రెండు సినిమాలు ఆడినంత మాత్రనా పూర్తిస్థాయి హీరో అనుకుంటే ఎలా? ఇదిగో ఇలా ఫ్లాప్‌లు వస్తాయి. ఒకప్పటి స్టార్ కమేడియన్ సునీల్ విషయంలో ఇదే జరుగుతోంది. దసరాకి వచ్చిన చిత్రం 'రోల్డ్ గోల్డ్'గా మిగిలింది. ఇది 'జక్కన్న' తర్వాత మరో ఫ్లాప్.
టాలీవుడ్ చరిత్రలో కమేడియన్‌లు హీరోలుగా రాణించిన దాఖలాలు లేవు. నాటి కస్తూరి శివరావు నుండి నేటి సునీల్ వరకు ఇది వాస్తవం. ఈ వాస్తవం తెలిసే అలీ వంటి సీనియర్ రెండు పడవల అంటే ఒకవైపు హీరో మరోవైపు తన రెగ్యులర్ పాత్రలు చేస్తూ వెళ్ళాడు కాబట్టే ఇప్పటికీ రన్నింగ్‌లో ఉన్నాడు. సునీల్ విషయం అలాకాదు కామెడీ వేషాలు మొత్తానికి వదిలేశాడు. దాంతో ఆ గ్యాప్‌లో సప్తగిరి చేరిపోయాడు. మళ్లీ సునీల్ వెనక్కి వచ్చినా సరే ఖాళీ లేదన్నమాట.
ఇక సునీల్ అస్తమానం చిరంజీవి భజన చేయడం మిగతా హీరోల ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. ఈ కారణంగా కూడా అతడి సినిమా చూడ్డానికి ఇష్టపడడం లేదని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
చాలా విరామం తర్వాత సునీల్‌ను నమ్ముకుని సినిమా తీస్తున్న ఎన్‌కౌంటర్ శంకర్ పరిస్థితి మాత్రం ఇబ్బందిగా మారింది. మార్కెట్ లేని హీరోతో ముందుకెళతాడా లేక మరో హీరోని చూసుకుంటాడా? అనేది చూడాలి.